twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముంబై మున్సిపల్ కార్మికుల కోసం హృతిక్ భారీ విరాళం..

    |

    బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మానవత్వాన్ని చాటుకొన్నారు. కరోనా కాటుకు అతలాకుతలమైన జీవితాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో వీధిన పడిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు.

    కరోనా పరిస్థితి కారణంగా రేయింబవళ్లు శ్రమిస్తున్న ముంబై మున్సిపల్ (బీఎంసీ) కార్మికులకు ఆర్థిక సహాయం అందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల్లో భాగంగా కావాలని నిర్ణయించుకొన్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న మహారాష్ట్ర పభుత్వానికి సహాయంగా నిలిచారు అని అధికారులు వెల్లడించారు.

    Hrithik Roshan annonces Rs 20 lakh donation for BMC workers.

    బీఎంసీ వర్కర్లు, ఇతర సహాయ బృందాల కోసం హృతిక్ రోషన్ సుమారు రూ.20 లక్షల విరాళం ప్రకటించారు అని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

    ఈ సందర్బంగా హృతిక్ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి కష్టకాలంలో మన కోసం, సొసైటీ కోసం ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ప్రతీ ఒక్కరికి మనం అండగా నిలువాలి. బీఎంసీ సిబ్బంది కోసం n95, FFP3 మాస్కులను అందిస్తున్నాను అని హృతిక్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Bollywood Actor Hrithik Roshan annonces Rs 20 lakh donation for BMC workers. He tweeted that In times such as these, we must do whatever we can to ensure the safety of the most fundamental caretakers of our city and society. I have procured N95 and FFP3 masks for our BMC workers and other caretakers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X