Fighter Critic Review: సెన్సేషన్‌గా మారిన ఫైటర్ ఫస్ట్ రివ్యూ.. నిజంగానే అంత బావుందా ఏంటి?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కలిసి నటించిన మొదటి చిత్రం ఫైటర్. ఇక ఏరియల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. ఫైటర్ మూవీని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. హృతిక్ తో ఇప్పటికే బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు తెరకెక్కించాడు సిద్ధార్థ్. ఇది వీరి కాంబోలో వస్తున్న మూడో చిత్రం. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ క్రిటిక్ ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ఫైటర్. ఇక వీరి కాంబోలో ఇప్పటికే బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు వచ్చాయి. అయితే వీరి కాంబినేషన్ నుంచి వచ్చిన గత రెండు సినిమాల కంటే కూడా ఇది చాలా తక్కువ బజ్ తోనే విడుదల అయింది. ఫైటర్ చిత్రం జనవరి 25న థియేటర్లోకి వచ్చి సందడి చేస్తుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు సెన్సేషల్ హిట్లుగా నిలిచినా.. ఈ చిత్రానికి అంతగా బజ్ అయితే ఏర్పడలేదు.

వార్, పఠాన్ వంటి సూపర్ హిట్ల తర్వాత ఈ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా, దీపికా పదుకుణె హీరోయిన్ గా నటించింది. పబ్లిక్ టాక్ చూసుకుంటే.. ఈ సినిమా బాగానే ఉందని కామెంట్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ అని చెప్పుకునే తరణ్ ఆదర్శ్ ఇచ్చిన ఫస్ట్ రివ్యూ వైరల్ గా మారింది. ఏకంగా ఈ సినిమాకు నాలుగున్నర రేటింగ్ ఇవ్వడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.

తరణ్ ఆదర్శ్ తన సోషల్ మీడియా వేదికగా... ఫైటర్ మూవీకి ఏకంగా 5 స్టార్ రేటింగ్స్ కు... 4.5 స్టార్స్ ఇచ్చారు. ఇక వన్ వర్డ్ రివ్యూ అంటూ... 'ఫైటర్' మూవీ బ్రిలియంట్ అని రాసుకువచ్చారు. ఇక డోంట్ మిస్ ఇట్ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. తరణ్ ఆదర్శ్ రివ్యూ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇది పెయిడ్ రివ్యూ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాకు బజ్ లేదు.. నెగిటివిటీ రాగా.. ఇప్పుడు సడెన్ గా తరణ్ ఆదర్శ్ బ్లాక్ బస్టర్ అంటూ అంత రేటింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.

దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ హ్యట్రిక్ కొట్టారు... ఏరియల్ కాంబాట్, యాక్షన్, డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి... ఫైటర్లో అన్నీ ఉన్నాయంటూ తరణ్ తన ట్విట్టర్ లో రాసుకువచ్చారు. కింగ్ సైజ్ ఎంటర్‌టైనర్. హృతిక్ రోషన్ సాహసోపేతమైన నటన టాప్ క్లాస్ అంటూ వెల్లడించారు. ఈ సినిమాను మిస్ అవ్వొద్దని తెలిపారు. దీంతో పాటు సుదీర్ఘ రివ్యూను రాసుకువచ్చారు.
ఇదంతా బాగానే ఉన్నా... ఈ సినిమాకు ఏకంగా నాలుగున్నర స్టార్స్ ఇవ్వడం చర్చకు దారి తీసింది. ఈ సినిమా అంత బాగుందా లేక పెయిడ్ రివ్యూనా అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు అయితే వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











