ఇండియాలో అలాంటి దమ్మున్న హీరో జూ.ఎన్టీఆర్ ఒక్కడే.. హృతిక్ రోషన్ కామెంట్స్ వైరల్

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన మల్టీస్టారర్ భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2. ఈ చిత్రం 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బ్రహ్మాస్త్రం మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వార్ 2 చిత్రంలో జూ.ఎన్టీఆర్ తో కలిసి నటించడం పట్ల హృతిక్ రోషన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇంటర్వ్యూల్లో హృతిక్ రోషన్ చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

వార్ 2 ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ విషయంలో నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేశారు. ఆయన రిహార్సల్ అస్సలు చేయరు. ఇలా చూసి అలా చేస్తారు. ఇక యాక్టింగ్ లెవల్స్ కూడా హైలో ఉంటాయి. నేను ఆయన్ని చూసి కొన్ని విషయాలు నేర్చుకున్నారు. ఇప్పటి వరకు నేను కలిసి పనిచేసిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ది బెస్ట్' అంటూ చెప్పుకొచ్చారు. ఇక హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ మరింతగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Hrithik Roshan Praised Jr NTR

'వార్ 2తో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఆయన నాకు వార్ 2లో కో స్టార్ గా నటించారు. కానీ ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షార్ట్ పూర్తయ్యే లోపు నాకు సొంత బ్రదర్ గా మారిపోయారు. ఆయన మీ ఫ్యాన్స్ అందరికీ అన్న. నాకు సొంత తమ్ముడు. టైగర్ నుంచి ఎక్సలెంట్ డ్యాన్స్ స్కిల్స్, యాక్షన్ పెర్ఫామెన్స్, ఎనర్జీ లెవల్స్, యాక్టింగ్ టెక్నిక్స్ అన్నీ నాకు కొత్త పాఠంలా అనిపించాయి. ఆయన్ని చూసే నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపించింది. ప్రతి షాట్ లో 100 శాతం బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. వార్ 2లో నేర్చుకున్న విషయాలన్నీ తప్పకుండా నా రాబోయే చిత్రాల్లో అనుసరిస్తాను.' అని వ్యాఖ్యానించడం వైరల్ గా మారింది.

ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అరుదైన గుర్తింపు డ్యాన్స్ స్కిల్స్. ఆయనతో పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లు, కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు, డైరెక్టర్స్ అందరూ చెప్పే మాట ఒక్కటే. తారక్ వన్ టేక్ యాక్టర్, అలాగే రిహార్సల్ చేయకుండా అద్భుతంగా డ్యాన్స్ చేయడం ఆయన ప్రత్యేకత అని చాలా సందర్భాల్లో తెలిపారు. ఇక వార్ 2 ద్వారా ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్టర్, హ్యాండస్ హీరో హృతిక్ రోషన్ కూడా ఇదే ప్రస్తావించడంతో ఇండియా మొత్తం జూనియర్ ఎన్టీఆర్ నైపుణ్యం గురించి మరోసారి మాట్లాడేలా చేసింది.

ఇక వార్ 2 చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ఆదిత్యా చోప్రా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. తొలిసారిగా బాలీవుడ్ కు ఎన్టీఆర్, టాలీవుడ్ కు హృతిక్ రోషన్ ఎంట్రీ ఇస్తున్న చిత్రంగా ప్రకటించారు. 2019లో వచ్చిన వార్ చిత్రానికి సీక్వెల్ గా వార్ 2 మూవీని రూపొందించడం విశేషం. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Read more about: hrithik roshan jr ntr war 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X