ఎన్టీఆర్ తో యాక్టింగ్.. హృతిక్ రోషన్ ఏమన్నాడో తెలుసా? షాకింగ్
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిగా 'దేవర' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నుంచి ఎన్టీఆర్ రేంజ్ ఇంకెంతలా పెరిగిపోయిందో తెలిసిందే. ఇండియాతో పాటు వరల్డ్ మార్కెట్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలకు మార్కెట్ ఏర్పడింది. మరోవైపు భారీ ప్రాజెక్ట్స్, క్రేజీ కాంబినేషన్స్ ను సెట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'వార్ 2'. ఈ చిత్రం 'వార్'కు సీక్వెల్ గా రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండటం విశేషంగా మారింది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇద్దరు స్టార్ హీరోలకు, యాక్షన్ కింగ్ లు కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హృతిక్ రోషన్ తాజాగా ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్ కు వెళ్లిన హృతిక్ రోషన్ తన బెస్ట్ కో యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ తో వార్2 మూవీని కంప్లీట్ చేశానని, అతను నాకు ఫేవరెట్ కో యాక్టర్ అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ బ్రిలియంట్, ఫైన్ టీమ్ మేట్, సినిమా మా సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని, మీరు అందరూ చూస్తే ఆశ్చర్యపోతారని చెప్పుకొచ్చారు.
2025 ఆగస్టు 14న వార్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం విడుదల కోసం తాను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానని చెప్పారు. అయితే హృతిక్ రోషన్ ఇంత వరకు తన బెస్ట్ కో యాక్టర్ అని ఎవరి పేరు చెప్పలేదు. ఫస్ట్ టైమ్ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పడంతో షాకింగ్ గా మారింది. ఏకంగా యాక్షన్ కింగ్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ఇక 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ తర్వాత హాలీవుడ్ దర్శకులు, నటులు ఎన్టీఆర్ పై ఎలాంటి ప్రశంసలు కురిపించారో తెలిసిందే. ఎన్టీఆర్ యాక్టింగ్ పొటెన్షియాలిటీకి ఇండియానే కాదు అప్పుడు వరల్డ్ మొత్తం షేక్ అయ్యిందనే చెప్పాలి. ఇక వార్2తో ఎలాంటి రికార్డ్స్ సెట్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరో నాలుగు నెలల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనూ భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు త్వరలోనే 'దేవర పార్ట్ 2' చిత్రాన్ని కూడా ప్రారంభించ బోతున్నారు.


Click it and Unblock the Notifications











