twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనాలో హృతిక్ సినిమా.. సూపర్ 30 రిలీజ్‌కు ఏర్పాట్లు

    |

    ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనావైరస్‌కు చైనానే అనే విషయం తెలిసిందే. వూహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ ప్రజలను గజగజ వణికిస్తున్నది. ఈ క్రమంలో సినీ పరిశ్రమలో కార్యకలాపాలు ఉన్నట్టుండి నిలిచిపోయాయి. ఇక చైనాలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే చైనాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న క్రమంలో బాలీవుడ్ చిత్రం రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకొంటున్నది.

    బాలీవుడ్ సూపర్‌స్టార్ హ‌ృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 మూవీ చైనాలో రిలీజ్ కావడానికి ఏర్పాట్లు జరుగుున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేయగానే సినిమాను రిలీజ్ చేస్తామని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ సీఈవో సైభాషిస్ సర్కార్ తెలిపారు.

    Hrithik Roshans Super 30 to be release in China

    సూపర్ 30 సెన్సార్ కార్యక్రమాలకు అప్లై చేసుకొన్నాం. సాధారణ పరిస్థితులు నెలకొని ఇండస్ట్రీలో కార్యక్రమాలు మొదలు కాగానే మొట్టమొదటగా సెన్సార్ జరుగుతుంది. ఆ తర్వాత రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం అని సర్కార్ పేర్కొన్నారు.

    ప్రముఖ గణిత శాస్త్రవేత్త, సూపర్ 30 ప్రొగ్రాం వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా సూపర్ 30 చిత్రం రూపొందింది. సామాజికంగా వెనుకబడిన విద్యార్థులను ఐఐటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ కోసం తర్పీదు ఇచ్చి వారిని సెలెక్ట్ అయ్యే విధంగా కోచింగ్ ఇవ్వడంలో ఆనంద్ కుమార్ ఘనతను సాధించారు.

    బాలీవుడ్‌లో రిలీజైన సూపర్ 30 చిత్రం దేశవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్నది. రూ.100 కోట్లకుపైగా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. ఈ చిత్రానికి బీహార్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లో వినోద పన్ను మినహాయింపు లభించింది.

    English summary
    Super Star Hrithik Roshan's Super 30 to be release in China after post coronavirus pandemic. Reliance Entertainment Group CEO Shibashish Sarkar confirmed that "Super 30 was applied for censorship in China.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X