బాలీవుడ్ తెరపై 3డీలో రామాయణం.. రావణుడిగా హృతిక్ రోషన్.. సినిమా బడ్జెట్ ఎంతంటే?
భారతీయ సినీ పరిశ్రమలో మరో క్రేజీ ప్రాజెక్టుకు తెర లేచింది. పౌరాణిక కథా నేపథ్యంగా రామాయణం చిత్రాన్ని బాలీవుడ్‌లో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 3డీలో రూపొందనున్న రామాయణం చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మధు మంతెన నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హృతిక్ రోషన్ రావణుడిగా నటించనున్నారు. ఈ వార్త బాలీవుడ్‌లో వైరల్‌గా మారింది.
ఇక ఈ రామాయణం చిత్రంలో దీపిక పదుకోన్ సీతగా నటిస్తున్నారనే ఓ వార్త ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడానికి నిర్మాత సిద్ధమయ్యారు. అయితే రాముడి పాత్రను ఎవరు పోషిస్తున్నారనే విషయాన్ని నిర్మాతలు గోప్యంగా ఉంచుతున్నారు.

ఇక రావణుడిగా నటించే హృతిక్ రోషన్‌తో నిర్మాత, దర్శకుల చర్చలు సఫలంగా ముగిసాయి. వారి మధ్య జరిగిన చర్చల అనంతరం హృతిక్ రావణుడిగా నటించేందుకు అంగీకరించారనే విషయాన్ని బాలీవుడ్‌కు చెందిన పత్రిక తన కథనంలో పేర్కొన్నారు.
ఇక హృతిక్ కెరీర్ విషయానికి వస్తే.. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే ఫైటర్ సినిమాలో హృతిక్ నటిస్తున్నారు. హృతిక్ సరసన దీపిక పదుకోన్ నటిస్తున్నారు. హృతిక్, దీపిక కలిసి నటించడం ఇదే మొదటిసారి.


Click it and Unblock the Notifications











