Adipurush ఈవెంట్ కోసం కోట్లల్లో ఖర్చు.. ప్లాన్స్ మామూలుగా లేవు..
డార్లింగ్ ప్రభాస్ శ్రీరాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. త్రీడీ ఎఫెక్ట్స్ లో విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై దర్శకుడు ఓం రౌత్ ఆవిష్కరించబోతున్నాడు. ఇక ఈ విజువల్ ఫీస్ట్ ని ఎంజాయ్ చేయడం కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రామాయాణం కథ ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ కావడంతో వార్ సీక్వెన్స్ గూస్ బాంబ్స్ క్రియేట్ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, రెండు సాంగ్స్ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో మూవీపై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. కచ్చితంగా వెయ్యి కోట్లు కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆదిపురుష్ ప్రమోషన్స్ లో భాగంగా జూన్ 6న తిరుపతి వేదికగా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకోసం ఏకంగా 200 మంది డాన్సర్స్, 200 మంది గాయకులని ఇన్వైట్ చేసారంట. వారంతా స్టేజ్ మీద పాటలతో అలరిస్తారని తెలుస్తోంది.
అలాగే ఆదిపురుష్ ఈవెంట్ ఏర్పాటు చేసే మైదానం అంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయే విధంగా స్టేజ్ డెకరేషన్ చేయబోతున్నారంట. అదే సమయంలో అంతంటా శ్రీరామ నామం ప్రతిద్వనించే విధంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారని టాక్. అలాగే ఫైర్ క్రాక్స్ ఆకాశం లోకి వెళ్ళిన తర్వాత జైశ్రీరామ్ సౌండ్ వ్యాపించేలా ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారంట.
వీటికోసమే లక్షల్లో ఖర్చు చేస్తున్నారని వినికిడి. ఇక ఆదిపురుష్ చిత్ర యూనిట్ మొత్తం ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారంట. మొత్తానికి ఈ ఈవెంట్ కోసం కోటి నుంచి రెండు కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు అని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు రిలీజ్ హక్కులని సొంతం చేసుకోవడంతో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ బాద్యత కూడా వారే చూసుకుంటున్నారంట.


Click it and Unblock the Notifications











