Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'చెక్' ట్రైలర్ తోనే అంచనాల డోస్ పెంచిన నితిన్.. రిలీజ్ డేట్ మారడానికి కారణమిదే!
ఉరిశిక్ష పడ్డ ఖైదీగా జైలులో ఉన్న ఓ యువకుడు తనకు ఎదురైన పరిస్థితులతో ఏ విధంగా పోరాడాడు అనే.. కాన్సెప్ట్ వింటుంటే ఎంతో ఆసక్తిగా ఉంది. ఈ ఒక్క లైన్ చెక్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'చెక్'.
రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చదరంగం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేశారు. సినిమా ట్రైలర్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. రెండు నిమిషాల ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. 'వీళ్లకు ఏ సమస్య వచ్చినా కుంగిపోరు. సొల్యూషన్ వెతుకుంటూ ఉంటారు', 'నువ్విక్కడ ఏం చేసినా కొన్ని కళ్లు చూస్తూనే ఉంటాయి', 'ఆదిత్య కేసులో క్షమాబిక్షకు అవకాశం ఉందా?' డైలాగులు 'చెక్'పై మరింత ఆసక్తిని పెంచాయి.
చెస్ నేపథ్యంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చక్కటి యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ రూపొందించారని నిర్మాత ఆనంద్ ప్రసాద్ తెలిపారు. తొలుత 19న విడుదల చేయాలని అనుకున్న ఈ సినిమాను సీజీ వర్క్స్ ఆలస్యం కారణంగా, 26న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇక బుధవారం విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభించింది.
నితిన్ కొత్త లుక్ బావుందని ప్రశంసలు వస్తున్నాయి. చెస్ ప్లేయర్ హారిక ద్రోణవల్లి కూడా ట్రైలర్ బావుందని ట్వీట్ చేశారు. చెస్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కోసం చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నానని సాయి తేజ్, వరుణ్ తేజ్ కూడా కామెంట్స్ చేశారు. హీరోయిన్ కీర్తీ సురేష్ తదితరులు ట్రైలర్, అందులో నితిన్ లుక్ పై ప్రశంసలు కురిపించారు. నితిన్ వారికి అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా చెప్పారు. మరి సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.