twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లీకైన సాహూ స్టోరీ లైన్.. నెటిజన్స్ ట్రోలింగ్

    |

    బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ ప్రాజెక్టు సాహూ. ఒళ్ళు గగ్గుర్లు పొడిచే యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోంది. చాలా రోజులుగా సెట్స్ పైనే ఉన్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. సరిగ్గా ఈ తరుణంలో సాహూ స్టోరీ లైన్ ఇదే అంటూ నెట్టింట ప్రచారం మొదలైంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఆ స్టోరీ లైన్ తో సినిమా కష్టమే కదా! ఏంటి ప్రభాస్ ఈ కథను ఎలా ఎంచుకున్నాడు? అనే కోణంలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యాయి.

    తన కుటుంబాన్ని అంతం చేసిన డాన్‌ని చంపడానికి నకిలీ ఇంటర్‌పోల్‌ ఏజెంట్‌గా చేరిన హీరో.. తాను అనుకున్నది ఎలా సాధిస్తాడనేదే సాహూ స్టోరీ లైన్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ సాహూ పై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ప్రభాస్ కెరీర్ లో బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమాలో ఇంత సింపుల్ స్టోరీ లైన్ ఉంటే అస్సలు వర్కవుట్ కాదని తెగ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో సాహూ చర్చలు బాగా ముదురుతున్నాయి.

    Huge Discussions On Prabhas Sahoo StoryLine

    ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే సాహూ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రయూనిట్.. షేడ్స్ అఫ్ సాహూ పేరిట పలు వీడియోలు రిలీజ్ చేసింది. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం ఒక్క పాట మినహా ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అయింది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    English summary
    Young rebal star Prabhas new movie Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully going on. The latest Discussion on Sahoo is..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X