12 దేశాల్లో రాధేశ్యామ్ అతి ముఖ్యమైన పనులు.. ఆ ఎపిసోడ్ కోసమే..
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న మూడవ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సాహో సినిమా అనంతరం ఎలాగైనా మరొక మంచి సక్సెస్ అందుకోవాలని ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ లవ్ స్టోరీగా గా తెరకెక్కిన ఈ సినిమా కోసం దర్శకుడు రాధాకృష్ణ చాలా హార్డ్ వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కథ కోసమే చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం చాలామంది రైటర్స్ నుంచి సలహాలు తీసుకున్నాడట.
స్టోరీ చెప్పగానే ప్రభాస్ చాలా వేగంగా సినిమాలు చేద్దామని అన్నాడట. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాధాకృష్ణ సినిమా మొత్తం లో క్లైమాక్స్ చాలా బాగుంటుంది అని సినిమాలో ఆ ఎపిసోడ్ చూసిన ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరని కూడా చెప్పాడు. ఇక డార్లింగ్ ప్రభాస్ ను ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో అంతకంటే ఎక్కువ స్థాయిలో సినిమాలో కనిపిస్తాడని తెలియజేశారు. అయితే ఈ సినిమాలో అన్నిటికంటే ప్రధానమైన క్లైమాక్స్ ఎపిసోడ్ విషయంలో కూడా ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ట్రైలర్లో కూడా అదే విషయాన్ని ఎక్కువగా హైలెట్ చేసినట్టు అనిపించింది. సముద్రం మధ్యలో పెద్ద షిప్ లో హీరో హీరోయిన్ ప్రేమ అనుభూతులను చాలా చక్కగా చూపిస్తారట. అలాగే ఆ సముద్రపు తుఫానులో వారిద్దరూ మరణించారా లేదా అనేది కూడా చాలా ఆసక్తిగా ఉంటుందట.

సినిమాలో హీరో కాలాన్ని ఎదిరించి తన ప్రేమను ఎలా రక్షించుకున్నాడు మరో జన్మలో వారిద్దరూ మళ్ళీ ఏకమవుతారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా కూడా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని తెలుస్తోంది. ఇక రాధే శ్యామ్ యొక్క VFX సూపర్‌వైజర్, కమల్ కన్నన్ అత్యుత్తమ అవుట్‌పుట్‌ను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయనీ తెలుస్తోంది.
సినిమా నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫైట్లు లేవని దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇచ్చేశాడు. ఎక్కువగా ప్రేమ కు సంబంధించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా చాలా హార్ట్ ఫుల్ గా ఫీల్ అవుతారని కూడా తెలియజేశారు. మరి సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ఇక జనవరి 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమా అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా అనంతరం ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఓం రావత్ దర్శకత్వంలో రామాయణం బ్యాక్ డ్రాప్ రూపొందుతున్న ఆది పురుష్ సినిమా విడుదల కానుంది. ఇక ఆ తరువాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ K, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలతో ప్రభాస్ బిజీ కానున్నాడు.


Click it and Unblock the Notifications











