కెజిఎఫ్ చాప్టర్ 2 క్రేజ్ చూశారా.. క్యూలో బారులు తీరిన జనం!

కన్నడ హీరో యష్ నటించిన కేజిఎఫ్ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో యష్ నటన, యాక్షన్ సన్నివేశాలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. కెజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా వసూళ్ళలో రికార్డులు సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి చాలా మంది సినీ కురిపించారు. అదే ఉత్సాహంతో కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రానికి చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో కొన్ని పాత్రల కోసం ఇటీవల ఆడిషన్స్ నిర్వహించారు.

ఈ ఆడిషన్స్ కు మతిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆడిషన్స్ జరుగుతున్న ఆఫీస్ ముందు కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరి ఉన్నారు. కెజిఎఫ్ చిత్రానికి సినీ అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఇదని అంటున్నారు. చిత్ర యూనిట్ కూడా ఈ స్థాయిలో ఆడిషన్స్ కు రెస్పాన్స్ ఉంటుందని ఊహించలేదు. కెజిఎఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Hundreds line up in Bengaluru for a chance to act in KGF 2 with Yash

ఈ చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అనంత్ నాగ్ కీలక పాత్రలో నటించారు. తొలి భాగం భారీ విజయం కావడంతో చాప్టర్ 2పై అంచనాలు మరింత పెరిగాయి. అప్పటివరకు కన్నడ చిత్ర పరిశ్రమలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న యష్ కెజిఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజీ హీరోగా మారిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X