పుష్ప ఐటమ్ సాంగ్... చక్కని చుక్క కోసం సుక్కూ ఆరాటం
టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే, ఓ రేంజ్ లో ఉండాల్సిందే. జనాలపై అంతగా ఆ పాటలు ప్రభావం చూపుతున్నాయి అంటే, దానికి వెనుక సుకుమార్ విజన్ ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సుక్కూ, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప కోసమూ ఓ రేంజ్ లోనే అరేంజ్ మెంట్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది.
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2లో ఐటమ్ సాంగ్స్ వల్లే ఆల్బమ్ హిట్ అయిన సంగతిని అంత తేలిగ్గా మరచిపోలేం. ఆ పాటలు అంతగా అలరించాయి. ఇక పుష్పలోనూ ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. అయితే దీని కోసం ఓ సుందరాంగిని వెతికిపట్టుకునే పనిలో పడ్డారు చిత్ర యూనిట్.

దేవిశ్రీ స్వరాలకు, బన్నీ స్టెప్పులకు మ్యాచ్ అయ్యే విధంగా ఓ చక్కని చుక్కను వెతికిపట్టుకునే పనిలో ప్రస్తుతం పుష్ప టీమ్ తలమునకలైందని తెలుస్తోంది. సూపర్ పెప్పీ గా ఉండనున్న ఈ పాట, ఆల్బమ్ కే హైలైట్ గా మారబోతోందని వినికిడి. అందుకే, ఓ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీడ్రైవర్ గా కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అబ్బాయితో రొమాన్స్ చేసేందుకు ఇప్పటికే కన్నడ కస్తూరి రష్మిక మందనను ఫైనలైజ్ చేశారు. మరి బన్నీ ఎనర్జీకి మ్యాచ్ అయ్యే ఐటమ్ గర్ల్ ఎక్కడ ఉందో, ఎప్పుడు దిగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











