రెండు ఓట్లు వేయండి.. హుషారు టీం సరికొత్త ప్రమోషన్!
పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మాతగా లక్కీ మీడియా బ్యానర్‌పై రూపొందిన చిత్రం హుషారు. తేజూస్ కంచర్ల, ప్రియా వడ్లమాని, రాహుల్ రామకృష్ణ, రమ్య పసుపులేటి, దక్షా నగార్కర్, దినేస్ తేజ్, తేజ్ కూరపాటి, తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ నేపథ్యంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 7 విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నటీనటులు, నిర్మాత వేణుగోపాల్‌తోపాటు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి, సినిమాటోగ్రాఫర్ రాజు తోట, ఎడిటర్ విజయ్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల రోజున రిలీజ్
హీరో తేజుస్ కంచర్ల మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఎక్కువగా ఇప్పుడే మాట్లాడలేను. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతాను. మేము ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా హుషారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు జరిగే రోజున రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

వినోదంతోపాటు క్వాలిటీ
సినిమాటోగ్రాఫర్ రాజు తోట మాట్లాడుతూ.. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత. తొలుత కొంత బడ్జెట్‌పై పరిమితులు విధించినా.. సినిమా అవుట్ పుట్ బాగా రావడంతో ఖర్చుకు వెనుకాడలేదు. కాల్సిట్లు ఎక్కువైనా ఫర్వాలేదు. క్వాలిటీ బాగా రావాలని అన్నారు. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంది అని అన్నారు.

ట్రెండింగ్‌గా మ్యూజిక్
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. యూత్‌ను ఆకర్షించే కథ ఇది. అలా అనీ ఈ సబ్జెక్ట్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దూరంగా లేదు. ఈ సినిమాకు రాదాన్ అందించిన మ్యూజిక్ హైలెట్. ఇప్పటికే రిలీజైన పాటలు ట్రెండ్ అవుతున్నాయి. గీతా గోవిందం ఫేమ్ సిద్ శ్రీరాం పాడిన ఉండిపోరాదే గుండె నీదేలే పాట అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికల రోజున విడుదల చేస్తున్నాం. ఆ రోజున ప్రేక్షకులు రెండు ఓట్లు వేయాలి. ఒకటి సినిమాకు. రెండోది ఎన్నికల్లో అని వేణుగోపాల్ అన్నారు.

బీరు తయారు చేసే విధానం
చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. చక్కటి కథతో, ఆద్యంత వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించారు. బీర్ తయారు చేసే విధానం సినిమాకు హైలెట్. కేవలం వినోదమే కాకుండా ఎమోషనల్ క్లైమాక్స్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. రాజు తోట అందించిన సినిమాటోగ్రఫి ప్రత్యేక ఆకర్షణ అని అన్నారు.

నటీనటులు, సాంకేతిక వర్గం
రాహుల్ రామకృష్ణ, ప్రియా వడ్లమాని, రమ్య పసుపులేటి, అభినవ్ మెడిశెట్టి, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, దక్షా నాగార్కర్, హేమ ఇంగ్లే తదితరులు
ఆర్ట్ డైరెక్టర్: మరేష్ శివన్
ఎడిటర్: విజయ్ వర్ధన్
మ్యూజిక్: రాదాన్
సినిమాటోగ్రఫి: రాజు తోట
పీఆర్‌వో: పులగం చిన్నారాయణ
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, రియాజ్
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: శ్రీ హర్ష కొనుగంటి.


Click it and Unblock the Notifications











