Don't Miss!
- News పడమర దిక్కు తల పెట్టుకుని పడుకోవడం మంచిదేనా..?
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
విజయ్ దేవరకొండ ఫిదా.. హుషారు పాటపై మనసు పడేసుకొని..
లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన చిత్రం హుషారు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన హుషారు సినిమా పాటలు, ట్రైలర్లకు మంచి క్రేజ్ నెలకొని ఉన్నది. ఈ సినిమా పాటను కాకినాడలో జరుగుతున్న డియర్ కామ్రేడ్ షూటింగ్లో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఇటీవల రిలీజ్ చేశారు.
సిద్ శ్రీరాం పాడిన పాట
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రస్తుతం కాకినాడలో నా సినిమా షూటింగ్ జరుగుతున్నది. నిర్మాత బెక్కెం వేణుగోపాల్, దర్శకుడు హర్ష నా సెట్‌కు వచ్చి హుషారు సినిమా పాటను రిలీజ్ చేయమని అడిగారు. ఇప్పటికే సిద్ శ్రీరాం పాడిన పాటను విన్నాను. ఫ్రెండ్ షిప్ ఆధారంగా రూపొందించిన మూడో పాటను రిలీజ్ చేయమన్నారు అని విజయ్ దేవరకొండ అన్నారు.
పెళ్లిచూపులకు ముందే నాకు
పాట రిలీజ్‌కు ముందు ఈ సినిమాతో ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని విజయ్ దేవరకొండ చెప్పారు. వాస్తవానికి పెళ్లిచూపులకు ముందే హర్ష నాకు ఈ సినిమా స్క్రిప్టు పంపించారు. స్క్రిప్టు చదువుతున్నప్పుడే నాకు విపరీతంగా నవ్వు వచ్చింది. మాకు నచ్చే అర్బన్ టైప్ కామెడీ ఉంటుంది. ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. హుషారులో ఫ్రెండిష్ సాంగ్‌ను మీరు బాగా ఎంజాయ్ చేస్తారనుకొంటాను. హర్ష పోస్టర్, ట్రైలర్లను చూస్తుంటే నాకు పెళ్లిచూపులు రోజులు గుర్తుకొస్తున్నాయి. మొదటి సినిమా అప్పుడు ఉండే ఉత్సాహం హర్షలో కనిపిస్తున్నది. ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. ఈ పాటను కూడా ఎంజాయ్ చేయండి అని విజయ్ దేవరకొండ అని అన్నారు.
విజయ్ దేవరకొండతో ఫ్రెండిషిప్ పాట
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో మంచి రిలేషన్ ఉంది. అందుకే కాకినాడలో జరిగే షూటింగ్‌కు వచ్చి విజయ్ దేవరకొండను కలిశాం. మా హుషారు చిత్రంలోని ఫ్రెండిషిప్ పాటను రిలీజ్ చేయమని అడగ్గానే సంతోషంగా ఒప్పుకొన్నారు. విజయ్ దేవరకొండ చేతులు మీదుగా ఈ పాటను రిలీజ్ చేయించడం ఆనందంగా ఉంది అని అన్నారు.
విజయ్ దేవరకొండతో రిలీజ్ చేయించడం
దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. పెళ్లిచూపులకు ముందు నుంచి నాకు విజయ్ దేవరకొండతో పరిచయం ఉంది. అప్పట్లో ఈ స్క్రిప్టును ఆయనకు పంపాను. చాలా బాగుందని అప్పట్లో రెస్పాన్ష్ ఇచ్చారు. ప్రస్తుతం అదే సినిమాకు సంబంధించిన పాటను విజయ్ దేవరకొండతో రిలీజ్ చేయించడం ఆనందంగా ఉంది అని అన్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు. అర్జున్ రెడ్డి లో శివ క్యారెక్టర్ తో అవార్డు దక్కిన్చుకున్నా రాహుల్ రామ కృష్ణ ముఖ్య పాత్ర లో నటించారు. అర్జున్ రెడ్డి ఫేం రాజు తోట సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు.