యూత్‌కు కిక్కెక్కించే రీతిలో హుషారు.. డిసెంబర్ 14న రిలీజ్

లక్కీ మీడియా సంస్థ బ్యానర్‌పై నిర్మాత బెక్కెం వేణుగోపాల్ రూపొందించిన మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'హుషారు'. ఈ బ్యానర్‌లో 9వ చిత్రంగా వస్తున్నది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని అన్ని హంగులతో ఈ నెల డిసెంబర్ 14న విడుదల సిద్ధమైంది. సినిమా ప్రమోషనల్‌లో భాగంగా పలు జిల్లాల్లో హీరోలు, హీరోయిన్లు పర్యటించారు.

బస్సు టూర్‌లో భాగంగా తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రధాన నగరాల్లో కాలేజీలకు 'హుషారు' టీం విశేష ఆదరణ పొందింది. హుషారు టీమ్‌కు వేల సంఖ్య లో విద్యార్థులు స్వాగతం పలికి ఆదరణ చూపించారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచిన హుషారు సినిమాలోని 'వెళ్ళిపోమాకే'' ''పిచాక్'' పాటలను ఆడి,పాడి మూవీ టీంలో ఇంకా ఉత్సాహాన్ని పెంచారు.

Husharu movie set to release on Dec 14th

హుషారు రిలీజ్ డేట్‌ను నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ప్రకటిస్తూ మీడియాతో మాట్లాడారు. హుషారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. డిసెంబర్ 14న మా సినిమాని రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్‌కు ముందే 'హుషారు' సాంగ్స్ తోనే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. మా 'హుషారు' ఇంకా కుర్రకారుకు కిక్కెంచి, యూత్‌ను ఎలా కొత్త స్టెప్పులు వేయిస్తుందో మీరే చూస్తారు అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు.

హుషారు చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్, రియాజ్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో కనిపిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X