విజయ్ దేవరకొండ చేతుల మీదుగా హుషారు పాట రిలీజ్
సూపర్ పవర్‌స్టార్ విజయ్ దేవరకొండ హుషారు సినిమా ప్రమోషన్‌లో పాలు పంచుకొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫెండ్‌షిప్ పాటను విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు. అర్జున్ రెడ్డి ఫేం రాధాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉండిపోరా అనే పాట ప్రేక్షకాదరణ పొందుతూ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో మరోపాటను నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, రియాజ్‌లు శుక్రవారం (నవంబర్ 16న) విజయ్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందిన హుషారు చిత్రం డిసెంబర్ 7న లక్కీ మీడియా బ్యానర్‌పై రిలీజ్ కాబోతున్నది. గత 11 ఏళ్లుగా బెక్కం వేణుగోపాల్( గోపి) లక్కీ మీడియా టాలెంట్ ఉన్న కొత్త దర్శకులను తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేస్తున్నారు. ఈ ఏడాది హుషారు సినిమా తో శ్రీ హర్ష కొనుగంటి ని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసారు ..
తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు. అర్జున్ రెడ్డి లో శివ క్యారెక్టర్ తో అవార్డు దక్కిన్చుకున్నా రాహుల్ రామ కృష్ణ ముఖ్య పాత్ర లో నటించారు. అర్జున్ రెడ్డి ఫేం రాజు తోట సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు.



Click it and Unblock the Notifications











