చిరంజీవి పుట్టిన రోజు వేడుక.. పోటెత్తిన మెగా అభిమానులు
మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22న ఆయన 64వ పుట్టిన రోజు సందర్బంగా భారీ వేడుక ప్లాన్ చేశారు.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ గ్రాండ్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మెగా అభిమానులు తరలి రావడం విశేషం. ప్రస్తుతం శిల్పకళా వేదిక ప్రాంగణమంతా మెగా అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఆ ప్రాంతమంతా పోటెత్తిన మెగా అభిమానులతో సందడి సందడిగా మారింది.

ఈ పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ అందరూ పాల్గొని అభిమానులకు కనువిందు చేయనున్నారు. ఇక ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానుండటం మరో విశేషం. త్వరలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సారి పుట్టినరోజు వేడుక మరింత గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. వైభవంగా జరుగబోతున్న ఈ ఈవెంటులో సైరా మేకింగ్ వీడియో, టీజర్ కూడా ప్రదర్శించి మెగా అభిమానులను కనువిందు చేయనున్నారు.


Click it and Unblock the Notifications











