నెక్లెస్ విలువే 142 కోట్లు అయితే.. సుధారెడ్డి ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లంటే?
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఫ్యాషన్ షో మెట్ గాలా 2026లో హైదరాబాదీకి షాన్ సుధారెడ్డి మెరుపులు మెరిపించారు. దేశవ్యాప్తంగా టాప్ సెలబ్రిటీలు పాల్గొన్న ఈ షోలో అందర్నీ పక్కకు నెట్టి తన మార్కుతో మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచారు. అత్యంత ఖరీదైన నెక్లెస్ ధరించి ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు, మీడియా చూపును తనవైపుకు తిప్పుకొన్నారు. మీడియాలోను, సోషల్ మీడియాలోను అందరి నోట సుధారెడ్డి గురించే ఆశ్చర్యకరమైన మాటలు వినిపిస్తున్నాయి. అయితే యువ పారిశ్రామిక వేత్త సుధారెడ్డి ధరించిన ఆ నెక్లెస్ విలువ ఎంత? ఆ ఆభరణం ప్రత్యేకత, విశేషం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
ప్రతీ ఏడాది జరిగే మెట్ గాలా 2026 ఫ్యాషన్ షోలో ఈసారి కూడా భారతీయ ప్రముఖులు భారీగా పాల్గొన్నారు.న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ వేడుకలో ఇండియా తరఫున పాల్గొన్న వారిలో బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్, రియలన్స్ ఫ్యామిలీకి చెందిన ఇషా అంబానీ, బిర్లా కుటుంబానికి చెందిన అనన్య బిర్లా ఉన్నారు. ఇక అంతర్జాతీయ సెలబ్రిటీలు సినీ తారలు బెయాన్స్, నికోల్ కిడ్మన్, టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్, అన్నా వింటూర్, రిహాన్నా, కిమ్ కర్దాషియాన్, కైలీ జెన్నర్, కెండాల్ జెన్నెర్, అన్నా హాత్‌వే తదితరులు పాల్గొన్నారు.

ఇలాంటి వరల్డ్ టాప్ ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్న ఈ ఫ్యాషన్ షోలో హైదరాబాద్‌కు చెందిన మెఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన సుధారెడ్డి టాప్ ట్రెండింగ్‌గా నిలిచారు. ఆమె ధరించిన 142 కోట్ల రూపాయల (15 మిలియన్ డాలర్లు) నెక్లెస్ గురించే అంతా మాట్లాడుకొంటున్నారు. ఈ నెక్టెస్ విశేషమేమీటంటే.. 550 క్యారెట్ల బరువు ఉన్న టాంజానియా పెండెంట్. ఈ అరుదైన పొదిగిన రత్నం టాంజానియాలోని మెరెలానీ హిల్స్ నుంచి తెప్పించారు.
అత్యంత విలువైన టాంజానియా రత్నం పొదిగిన నెక్లెస్ కాకుండా 3000 సంవత్సరాల క్రితం నాటి దక్షిణ భారతీయ చేనేత సంస్కృతి ఉట్టిపడేలా దుస్తులను ధరించారు. ఈ దుస్తులను మచిలీపట్నం ప్రాచీన కళంకారీతో చేశారు. దాదాపు 90 మందికి పైగా కష్టపడి ఈ డిజైన్‌ను రూపొందించారు. ఇంతటి అరుదైన ఆభరణంగా పేరు పొందిన రత్నం గురించి భారీ చర్చ జరుగుతున్నది. ఇదే కాకుండా 23 క్యారెట్ల ఎల్లో డైమండ్ రింగ్, రాజస్థాన్ నుంచి తెప్పించిన 30 క్యారెట్ల రోజ్ కట్ పోల్కి డైమండ్ రింగ్‌ను ధరించారు.
ఇక సుధారెడ్డి కుటుంబ నేపథ్యం గురించిన వివరాల్లోకి వెళితే.. మెఘా ఇంజనీరింగ్ సంస్థ వ్యవస్థాపకుడు పీపీ రెడ్డి సాధారణ రైతు కుటుంబానికి చెందిన వారు. 1989 సంవత్సరంలో ఈ సంస్థను ఇద్దరు ఉద్యోగులతో హైదరాబాద్‌లోని ఓ షెడ్డులో స్థాపించారు. ఆ తర్వాత ఈ సంస్థను పీవీ కృష్ణారెడ్డి అంచెలంచెలుగా అగ్ర సంస్థగా రూపొందించారు. ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో 30 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులు ఉన్నాయి. 2025 నాటికి ఈ సంస్థ ఆస్తుల విలువ 3.1 బిలియన్ డాలర్లు. ఇలాంటి సంస్థను నడిపిస్తున్న మెఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి కావడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications