twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో వివాదంలో రాంగోపాల్ వర్మ.. లడ్కీ సినిమాపై హైదరాబాద్ కోర్టు స్టే

    |

    ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో ఇరుక్కుపోయారు. ఆయన రూపొందించిన లడ్కీ (తెలుగులో అమ్మాయి) చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోర్టులో ఫిర్యాదు నమోదైంది. లడ్కీ చిత్రం జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో లడ్కీ సినిమాను నిలిపివేయాలని ఎన్ రవి అనే వ్యక్తి హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకొన్న కోర్టు లడ్కీ సినిమా ప్రదర్శనపై స్టే విధించింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

    లడ్కీ సినిమా, రాంగోపాల్ వర్మతో నెలకొన్న వివాదంపై ఫిర్యాదుదారు, నిర్మాత, డిస్టిబ్యూటర్ ఎన్ రవి స్పందించారు. గతంలో లక్ష్మీస్ ఎన్ఠీఆర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మా శివం సెల్లులాయిడ్స్ సంస్థకు రాంగోపాల్ వర్మ అమ్మారు. ఆ తర్వాత అదే సమయంలో మాకే కాకుండా ముంబై‌కి చెందిన మరో సంస్థకు రాంగోపాల్ వర్మ అమ్మారు. సినిమా హక్కుల అమ్మకం విషయం ఆలస్యంగా మాకు తెలియడంతో పలుమార్లు వర్మను సంప్రదించాం. ఈ వివాదంపై ఫిలిం ఛాంబర్‌లో కూడా వర్మపై ఫిర్యాదు చేశాం. అయినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాం అని రవి తెలిపారు

    Hyderabad City Civil court stays Ram Gopal Varmas Ladki movie

    Ladki movie review.. అమ్మాయి మూవీతో వర్మ మ్యాజిక్ చేశారా అంటే?Ladki movie review.. అమ్మాయి మూవీతో వర్మ మ్యాజిక్ చేశారా అంటే?

    హైదరాబాద్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. ఈ నెల 14వ తేదీన రాంగోపాల్ వర్మ రూపొందించిన లడ్కీ సినిమా ప్రదర్శనను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అన్నిరకాల డిజిటల్, ప్లాట్ ఫామ్స్‌లో కూడా సినిమాను అమ్మడానికి కానీ, బదిలీ చేయడానికి, కానీ ప్రదర్శించడానికి వీలులేకుండా తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని ఎన్ రవి చెప్పారు.

    English summary
    Director Ram Gopal Varma's Ladki movie landed into legal troubles. Distributor N Ravi files case against Ram Gopal Varma over Lakshmi's NTR movie distribution issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X