‘నారప్ప’ను వాడుకున్న హైదరాబాద్ పోలీసులు: బ్లాక్ చేయమంటూ హెచ్చరిక
విక్టరీ వెంకటేష్ - శ్రీకాంత్ అడ్డాల కలయికలో వచ్చిన చిత్రం 'నారప్ప'. తమిళంలో ధనూష్ హీరోగా రూపొందిన 'అసురన్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా రెండు రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో వెంకటేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఆయనలోని మాస్ యాంగిల్ చూపించిన తీరుకు ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను హైదరాబాద్ సిటీ పోలీసులు వాడేశారు.

హైదరాబాద్ సిటీ పోలీసులు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ప్రజల సమస్యలపై వేగంగా స్పందిస్తూ.. వాళ్లను నిత్యం అప్రమత్తం చేస్తూ ఎన్నో రకాల పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరాల గురించి ప్రస్తావిస్తూ.. 'నారప్ప' సినిమాలో విక్టరీ వెంకటేష్ చెప్పిన డైలాగును వాడుకున్నారు. దానిని 'సైబర్ నేరగాళ్లకు కార్డ్ డీటేల్స్ ఇస్తే దోచేస్తారు.. ఓటీపీ చెప్తే ఉన్న డబ్బంతా చుట్టేస్తారు.. అదే మెసేజ్ లేదా కాల్ రాగానే బ్లాక్ చేశామనుకో.. ఎవరూ ఏమీ సేయలేరు చిన్నబ్బా' అని మార్చారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'నారప్ప' చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెట్, వీ క్రియేషన్స్ పతాకాలపై డీ సురేష్‌బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. ఇందులో వెంకటేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. అప్పటి అసమానతలను చూపిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు మణి శర్మ అదిరిపోయే సంగీతం అందించాడు. వెంకటేష్‌ను ఎలా చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారో.. ఈ చిత్రం ద్వారా వాళ్లకు ఫుల్ మీల్స్ అందించాడు.


Click it and Unblock the Notifications











