సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఎక్కువ.. మానకపోతే కఠిన చర్యలు.. టాలీవుడ్‌కు పోలీస్ కమిషనర్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమవుతున్నది. గత రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ జరిపిన రివ్యూ మీటింగ్‌లో రాష్ట్రంలో డ్రగ్స్ దందాను పూర్తిగా నిర్మించాలి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండేలా చేయాలని సూచించారు. అయితే కొత్త ప్రభుత్వంలో పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీ శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో డ్రగ్స్ వినియోగాన్ని చూస్తే సినిమా పరిశ్రమలోనే ఎక్కువగా ఉంది. సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం తగ్గించడానికి సినీ పెద్దలతో చర్చిస్తాం. అందరికి మంచిగా చెబుతాం. వినకపోతే కఠిన చర్యలు తప్పవు. సినిమా వాళ్లు డ్రగ్స్ వాడకుండా మీటింగులు పెట్టుకొని కౌన్సిలింగ్ చేసుకోవాలి అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

సినిమా పరిశ్రమలో ఎక్కువగా డ్రగ్స్ వాడే అలవాటు ఉందనే విషయం దృష్టికి వచ్చింది. అలాంటి పరిస్థితి ఉంటే తగ్గించుకోవాలని సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలతో మీటింగ్స్ పెడుతాం. చిన్న పిల్లల మాదిరిగా డ్రగ్స్ పార్టీలు జరుపుకొంటున్నారు. వాళ్లందరికి కూడా మేము హెచ్చరికలు చేస్తున్నాం అని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడే సప్లై ఉంటుంది. సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వాడకంలో డిమాండ్ ఉంది. కాబట్టి సప్లై కూడా ఉంటుంది. డిమాండ్ తగ్గిస్తే.. ఆటోమేటిక్‌గా సప్లై తగ్గిపోతుంది. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు చర్చలు జరుపుతాం. వాళ్లకు మంచిగా చెబుతాం. మీలో మీరే సమావేశాలు పెట్టుకోని.. ఈ సమస్యకు అడ్డుకట్ట వేసుకోవాలి అని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్ నగరం డ్రగ్స్ రహిత ప్రాంతంగా ఉండాలన్నదే మా ప్రయత్నం. సినీ పరిశ్రమలో అందరూ చెడ్డవాళ్లని నా అభిప్రాయం కాదు. ఒక వ్యవస్థ అంటే మంచి వాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారు. సినీ పరిశ్రమలో చొరవ తీసుకొని డ్రగ్స్ వాడకాన్ని సినీ తారలు, సాంకేతిక నిపుణులు పూర్తిగా తగ్గించాలి. ఒకవేళ మాటలతో వినకపోతే.. కఠినమైన నిర్ణయాలు తీసుకొంటాం అని నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
గతంలో హైదరాబాద్ నగరంలో పలువురు సినీ తారలు డ్రగ్స్ వ్యవహారంలో చిక్కకోవడం సంచలనం రేపింది. చార్మీ, పూర్తి జగన్నాథ్, రవితేజ, నవదీప్, రానా తదితరుల పేర్లు మీడియాలో రావడం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఈడీ కూడా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











