Vijay Deverakonda విజయ్ దేవరకొండపై అసభ్య వీడియోలు.. యూట్యూబర్ అరెస్ట్

సోషల్ మీడియా, యూట్యూబ్‌లో పోటీ పెరిగిపోవడంతో రూమర్లు, గాసిప్స్, అశ్లీలత, అసభ్యకరమైన వార్తలకు బాగా ప్రాధాన్యం పెరిగిపోయింది. అలా రౌడీస్టార్ విజయ్ దేవరకొండపై అసభ్యకరంగా అవాస్తవాలు రాసిన ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

అర్జున్ రెడ్డి సినిమా హిట్‌తో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా ఓవర్‌నైట్‌లో స్టార్ అయ్యారు. గీతా గోవిందం నుంచి ఖుషీ వరకు తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసి విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్నాడు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలు పెద్దగా ఆడకకపోవడంతో త్వరలో రానున్న ఫ్యామిలీ స్టార్ సినిమాపై ఆశలు పెట్టుకొన్నారు.

Hyderabad Cyber crime Arrested youtuber circulating misleading information on Vijay Deverakonda

ఇలా ఇండియన్ సినిమా రంగంలో విజయ్ దేవరకొండ తన కంటూ ఓ ప్రత్యేకతను చాటుకొంటు వెళ్తుండగా.. ఆయనప అసభ్యకరంగా, వల్గర్‌గా న్యూస్ రాసి వీడియోలు తీసిన ఓ యూట్యూబర్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు సదరు యూట్యూబర్‌ను విచారించారు.

విజయ్ దేవరకొండపై అసత్య కథనాలు, అవాస్తవాలతో అశ్లీలంగా వీడియోలను రూపొందించిన యూట్యూబర్‌ను అనంతపురంకు చెందిన వెంకట కిరణ్‌గా గుర్తించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాడని పొలీసులు గుర్తించరు. సినీ పోలీస్ అనే పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తున్న ఆతడిని అరెస్ట్ చేశారు.

సినీ పోలీస్ యూట్యూబ్ ఛానెల్‌ నిర్వహిస్తున్న వెంకట కిరణ్‌పై సెక్షన్ 2590/2023 కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా దాఖాలు చేశారు. ఆ ఛానెల్‌ను పోలీసులు డిలీట్ చేయించారు. అతడికి కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నట్టు తెలిసింది. అవాస్తవాలతో, అసభ్యంగా ఎవరైనా వీడియోలు రూపొందిస్తే.. వారికి తగిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X