Guntur Kaaram గుంటూరు కారంపై దుష్ప్రచారం.. నలుగురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్!
సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం సినిమాకు సంబంధించిన విషయాలు మీడియాలో హైలెట్‌గా నిలిచాయి. హనుమ్యాన్ స్క్రీన్లు కేటాయించలేదని గుంటూరు కారం డిస్టిబ్యూటర్‌పై ఘాటుగా నెటిజన్లు విరుచుకుపడ్డారు.
Recommended Video

అంతేకాకుండా ఈ సినిమాపై వ్యతిరేకంగా బుక్ మై షో (Book My Show) యాప్, వెబ్‌సైట్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ అంశం అత్యంత వివాదంగా మారింది. ఈ వివాదాస్పద అంశానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం వెళితే.. హీరోయిన్‌గా బంపర్ ఆఫర్.. శివానీ లైఫ్‌ను మార్చేసిన ఇన్స్‌టాగ్రామ్!
https://telugu.filmibeat.com/interviews/shivani-video-interview-about-suhas-ambajipeta-marriage-band-movie-132161.html
గుంటూరు కారం సినిమాకు వ్యతిరేకంగా కొందరు బుక్‌మై షో యాప్‌లో దుష్ప్రచారం మొదలుపెట్టారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాతలు హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ చేపట్టిన సైబర్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ అనంతర వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
Mahesh Babu శ్రీమంతుడు కథ కాపీ వివాదం.. హృతిక్ రోషన్‌కు నోటీసులు?..అసలేం జరిగిందంటే?
https://telugu.filmibeat.com/whats-new/do-you-know-hrithik-roshan-get-notices-in-maheshbabu-srimanthudu-copyright-infringement-case-132171.html
ఇదిలా ఉండగా, ఇలాంటి నెగిటివ్ ప్రచారం వల్ల.. తక్కువ రేటింగ్ ఇవ్వడం వల్ల సినిమాపై ప్రభావం పడింది. దాంతో పలు చోట్ల ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి నష్టాలు వాటిల్లయ్యాని, సినిమాపై తీవ్ర ప్రభావం పడిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Drugs Case సినీ హీరో ప్రేయసి అరెస్ట్.. డ్రగ్స్ కేసులో తెరపైకి మరో వ్యక్తి.. రిమాండ్‌కు తరలింపు
https://telugu.filmibeat.com/news/actor-raj-tharun-lover-lavanya-unith-reddy-sent-to-remand-in-drugs-case-132167.html
ఇక దారుణమైన నెగిటివ్ క్యాంపెయిన్‌లోను గుంటూరు కారం చిత్రం 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా పలుచోట్ల బెక్ ఈవెన్ సాధించింది. ఓవర్సీస్‌లో భారీ నష్టాలను చవి చూసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











