రేవతి చనిపోయినట్లు ముందే తెలుసా ?.. పోలీసుల ప్రశ్నలకు అల్లు అర్జున్ ఉక్కిరి బిక్కిరి
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన ఇష్యూ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌దే. పుష్ప 2 సినిమా విడుదలకు ముందు హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా.. తర్వాత విడుదల, ఆయన ఇంటికి సినీ ప్రముఖులు క్యూకట్టడం, సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ , పోలీస్ అధికారుల కౌంటర్‌తో వాతావరణం హాట్ హాట్‌గా మారింది.
అల్లు అర్జున్ వివాదం ప్రస్తుతం టాలీవుడ్ మొత్తానికి పాకింది. సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కొత్త సినిమాలకు స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్ధలు కొట్టారు. త్వరలో తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని అనేక చిన్నా పెద్దా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వీటిలో గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్ సినిమా. టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు లేనిపక్షంలో రామ్ చరణ్ మూవీకి ఇబ్బందులు తప్పవు.

ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు టాలీవుడ్ పెద్దలు సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా పలువురు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉండే సినీ ప్రముఖులను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు మెగాస్టార్ చిరంజీవి పైనే ఉంది. ప్రస్తుతం ఆయనే పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నారు.. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంతో వచ్చిన విభేదాలను చిరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపి పరిష్కరించారు.
ఇప్పుడు స్వయంగా మేనల్లుడి కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ కష్టాల్లో పడటంతో చిరంజీవి రంగంలోకి దిగితే బాగుంటుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. కానీ అలా జరుగుతుందా? చిరంజీవి బాధ్యత తీసుకుంటారా? అనేది చర్చనీయాంశమైంది. ఇక సీఎం వ్యాఖ్యలకు కౌంటర్‌గా నిర్వహించిన ప్రెస్ మీట్ తర్వాత అల్లు అర్జున్ ఇరుక్కుపోయారు. ఆయన చెబుతున్నది అబద్ధమంటూ పోలీస్ అధికారులు, నెటిజన్లు వీడియో ఫుటేజ్‌ను బయటపెట్టడంతో బన్నీ సైలెంట్ అయ్యారు.

తాజాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా సోమవారం సాయంత్రం పోలీసులు నోటీసులు ఇవ్వడంతో అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. థియేటర్‌కు వచ్చేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారు? పోలీసులు పర్మిషన్ ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? మీరు థియేటర్‌లో ఉండగానే రేవంత్ మరణించినట్లు తెలుసా? రోడ్ షో కోసం ఎవరి అనుమతి తీసుకున్నారు? ఎంత మంది బౌన్సర్లను నియమించుకున్నారు? పోలీసులు, ప్రజలపై దాడి చేసిన బౌన్సర్లు ఎవరు? రేవతి మరణం తర్వాత పోలీసులకు బయటకు వెళ్లమన్నారా? లేదా? అంటూ దాదాపు 20కి పైగా ప్రశ్నలను అల్లు అర్జున్‌పై సంధించినట్లుగా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











