Most Desirable Woman 2020: దిగజారిన సమంత అక్కినేని.. ఎగబాకిన పూజా హెగ్డే, రకుల్ ప్రీత్
టాలీవుడ్‌లో అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్లలో కొందరు అరుదైన గుర్తింపును సొంతం చేసుకొన్నారు. ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 జాబితాలో స్థానం సంపాదించుకొన్నారు. వారిలో ఎవరున్నారంటే....
1. మొదటి స్థానంలో శృతిహాసన్ నిలిచారు. ఆమె గతంలో 2013లో ఓ సారి ఈ టైటిల్‌ను సాధించారు.
2. రెండో స్థానంలో సమంత అక్కినేని నిలిచారు. గతేడాది సమంత మొదటిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
3. మూడోస్థానాన్ని పూజా హెగ్డే సొంత చేసుకొన్నారు. గతేడాది 5 స్థానంలో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు రెండుస్థానాలను మెరుగు పరుచుకొన్నారు.
4. నాలుగోస్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ నిలిచారు. గతేడాది ఆమె 7 స్థానంలో నిలిచారు. ఈ సారి మూడు స్థానాలను మెరుగు పరుచుకొన్నారు.
5. ఐదో స్థానంలో రష్మిక మందన్న సత్తా చాటారు. 2020లో ఆమెకు 9వ స్థానం లభించింది.
6. ఆరవ స్థానం అదితి రావు హైదరీకి లభించింది. గతేడాది 4 స్థానంలో ఉండేవారు. రెండు స్థానాలను ఆమె దిగజార్చుకొన్నారు.
7. ఏడో స్థానంలో తాన్యా హోప్ నిలిచారు. ఈ జాబితాలో చేరడం ఇదే తొలిసారి.
8. ఎనిమిదో స్థానంలో నిధి అగర్వాల్ ఉన్నారు. 2020లో ఆమెకు 11వ స్థానం లభించింది.
9. కాజల్ అగర్వాల్‌కు 9 స్థానం లభించింది. గతంలో 8వ స్థానంలో ఉండేవారు.
10. రాశీ ఖన్నా పదో స్థానంలో నిలిచారు. గతేడాది 15వ స్థానంలో ఉన్నారు.

ఇక 11వ స్థానంలో శ్రద్దా శ్రీనాథ్ నిలిచారు. 12వ స్థానంలో పాయల్ రాజ్‌పుత్, 13వ స్థానంలో అదా శర్మా, 14వ స్థానంలో ప్రగ్యా జైస్వాల్; 15వ స్థానంలో పీవీ సింధు, 16వ స్థానంలో రాయ్ లక్ష్మీ, 17వ స్థానంలో తమన్నా భాటియా, 18 స్థానంలో రేహా సుక్రేజా, 19వ స్థానంలో మాళవిక శర్మ, 20 స్థానంలో దివి వద్యా నిలిచారు. మిగితా స్థానాల్లో రితు వర్మ, నభా నటేష్, సాయి పల్లవి, మిథాలి రాజ్, రాజ కుమారి, కీర్తీ సురేష్, అనుపమ పరమేశ్వరన్, ప్రియా జవాల్కర్, ఈషా రెబ్బా నిక్త్ జరీన్ తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











