నందమూరి నటసింహం..కొణిదెల కొదమసింహం , ఒకేసారి అసెంబ్లీకి..హైపర్ ఆది ఏం చెప్పాడ్రా

హైపర్ ఆది మాటల్లోనే పంచ్‌లు ఉంటాయి. ఆ పంచ్‌లకు చప్పట్లూ అదే రేంజ్‌లో ఉంటాయి. జబర్దస్త్‌లో అదిరే అభి టీమ్‌లో ఓ చిన్న కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆది తర్వాత తన టాలెంట్‌తో టీమ్ లీడర్‌గా ఎదిగాడు. గంటల తరబడి ఆగకుండా నవ్వించగల సత్తా ఆది సొంతం. కేవలం తన స్కిట్ కోసమే ప్రేక్షకులు జబర్దస్త్ ఎపిసోడ్ చూసేవాళ్లంటే అతిశయోక్తి కాదు.

యూట్యూబ్‌లోనూ మిలియన్లకొద్దీ వ్యూలతో సరికొత్త రికార్డులను సృష్టించాడు ఆది. జబర్దస్త్‌లో సత్తా చాటిన హైపర్ ఆది సినిమాల్లోనూ అదరగొడుతున్నాడు. వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో స్థానం సంపాదిస్తున్నాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, ఇతర మూవీ ఫంక్షన్‌లలో ఆది స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి తన పంచ్‌లు, ప్రాసలతో రెచ్చిపోయాడు.

hyper aadi interesting comments on ap assembly election results at gangs of godavari pre release event

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నటసింహం నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మైక్ అందుకున్న ఆది బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎన్టీఆర్ తెలుగుజాతి గౌరవాన్ని కాపాడితే.. ఓ పక్క సినిమాలు , ఇంకో పక్క నీతిగా రాజకీయాలు చేస్తూ బాలయ్య ఎన్టీఆర్ గౌరవాన్ని కాపాడారని ఆది చెప్పారు.

బాలయ్య వాళ్లను కొట్టాడు, వీళ్లని తిట్టాడని రాస్తుంటారని.. కానీ ఆయన ఎంతోమంది బతుకుల్ని నిలబెట్టాడని ఆది ప్రశంసించారు. బాలకృష్ణతో పనిచేసే వాళ్లందరికీ భయం, భక్తీ ఉంటాయని.. ఒక జనరేషన్‌కి ఆదిత్య 369 , మరో జనరేషన్‌కు సమరసింహారెడ్డి, ఇంకో జనరేషన్‌కి సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలను ఇచ్చారని చెప్పాడు. జనరేషన్లు మారినా బాలయ్య ఎనర్టీ ఏంట్రా అలాగే ఉందని కొందరు అంటూ ఉంటారని.. జనరేషన్లు మారితే మనుషులు మారుతారు, టెక్నాలజీ మారుతుంది.. బాలయ్య ఎందుకు మారుతుర్రా బ్లడీ ఫూల్ అంటూ ఆది ఉర్రూతలూగించాడు. స్టాక్ మార్కెట్ గ్రాఫ్ అయినా పెరుగుతూ ఉంటుందని కానీ.. బాలయ్య గ్రాఫ్ మాత్రం పెరుగుతూనే ఉంటుందన్నాడు.

బాలకృష్ణ.. మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్‌కు రావడం సంతోషంగా ఉందని ఆది అన్నాడు. పది నిమిషాల్లో క్లోజయ్యే పబ్బు ముందు జై బాలయ్య స్లోగన్ వింటే ఎంత కిక్కు వస్తుంది.. మా సినిమా చూస్తే అంతే కిక్కు వస్తుందని ఆది చెప్పాడు. మ్యాన్‌షన్ హౌస్ వేస్తే ఎంత కిక్కు వస్తుందో మా సినిమా చూస్తే అంతే కిక్కు వస్తుందన్నాడు. నందమూరి నటసింహం.. కొణిదెల కొదమసింహం కలిసి అసెంబ్లీలో అడుగుపెడితే ఎంత కిక్ వస్తుందో.. మా సినిమా చూస్తే అంతే కిక్ వస్తుందని హైపర్ ఆది అన్నాడు. అయితే చివరిలో చెప్పిన డైలాగ్‌ మాత్రం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌కు కారణమైంది.

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ.. కొణిదెల ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్‌లు పోటీ చేసిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా హిందూపురం నుంచి బరిలో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన బాలయ్య.. మరోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్ధిగా పిఠాపురం నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ అసెంబ్లీలో అడుగుపెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నారు.

పవన్ కళ్యాణ్‌ తరపున హైపర్ ఆది పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 4న విడుదల కానున్న ఫలితాల్లో బాలయ్య, పవన్ గెలిస్తే ఇద్దరూ అసెంబ్లీలో అడుగుపెడతారు. తద్వారా టాలీవుడ్‌ని శాసిస్తున్న ఇద్దరు అగ్ర కథానాయకులు , రెండు కుటుంబాల వారసులు ఒకేసారి శాసనసభలో కనిపిస్తే అభిమానులకు , ప్రజలకు పూనకాలు గ్యారంటీ. ఇకపోతే .. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్‌సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది, మధునందన్, ప్రవీణ్, గోపరాజు రమణ, తదితరులు కీలకపాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X