Hyper Aadi: పవన్ కళ్యాణ్ ప్యాకేజి స్టార్, దత్తపుత్రుడు కామెంట్స్ పై హైపర్ ఆది రియాక్షన్.. షాకింగ్ పంచ్!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు రాజకీయాలలో కూడా గ్యాప్ లేకుండా మంచి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇక ఇటీవల ఆయన జనసేన యువశక్తి మీటింగ్ నిర్వహించారు. అయితే ఆ వేడుకకు చాలామంది అక్కడికి వచ్చారు. ఇక వేడుకల్లో పాల్గొన్న కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆసక్తికరంగా మాట్లాడాడు. అయితే తాను కూడా జనసేన పార్టీలోని సభ్యుడిని అంటూ జబర్దస్త్ హైపర్ ఆది కూడా తన స్పీచ్ తో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ వివరాలలోకి వెళితే..

స్థాయి వేరు స్థానం వేరు

స్థాయి వేరు స్థానం వేరు

హైపర్ ఆది మాట్లాడుతూ.. మొదటిసారి నేను ప్రజలకు మంచి చేయాలి అని ఆలోచనతో ఉన్న నాయకులను ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడికి ఎంతోమంది యువత రావడంతో ఇప్పటికే ప్రత్యర్థి రాజకీయ నాయకులు కుల్లుకొని ఉంటారు. వారికోసం ఒక్క సెకండ్ మౌనం పాటిస్తే సరిపోతుంది. ఇక ఈ ప్రపంచంలో ఎంత కష్టపడినా ఈ పదవి అయినా దక్కుతుంది కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి ఎవరికి అంత ఈజీగా రాదు. ఆయన స్థాయి వేరు స్థానం వేరు అని హైపర్ ఆది అన్నాడు.

బిర్యాని ప్యాకెట్ల కోసం

బిర్యాని ప్యాకెట్ల కోసం

ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా మాట్లాడలేదు. జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో నేను కూడా అభ్యర్థిగా మాట్లాడడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది బిర్యాని ప్యాకెట్ల కోసం మందు కోసం రాలేదు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వచ్చారు. ఆయన మంచితనం చూసి వచ్చారు అని హైపర్ ఆది గొప్పగా వివరణ ఇచ్చాడు.

రైతుల కష్టం తీర్చడానికి

రైతుల కష్టం తీర్చడానికి

ఇక పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే వారికి ఇదే నా సమాధానం. రెండు చోట్ల ఓడిపోయారు అని చాలామంది అన్నారు. ఓడిపోతేనే ఆయన ఎంతో మంది కష్టాలను తీర్చాడు అంటే గెలిస్తే వాళ్ళ కష్టం కాంపౌండ్ వాల్ దాటకుండా చూసుకుంటాడు. రికార్డుల కోసం డబ్బు కోసం సినిమాలను చేసేవారిని చూసి ఉంటారు.

కానీ కౌలు రైతుల కష్టం తీర్చడానికి సినిమాలు ఒప్పుకున్నా హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆస్తి ఇక్కడున్న మిగతా రాజకీయ నాయకుల ఆస్తుల కంటే చాలా తక్కువ ఉంటుంది. వచ్చిన ప్రతి పైసా కూడా పంచుకొంటూ వెళుతున్నాడు కానీ డబ్బు పెంచుకుంటూ వెళ్లే ఆలోచన ఆయనకు లేదు. ఆయన పదవి లేకుంటేనే ఇంత సహాయం చేస్తున్నాడు. ఇక పదవి వస్తే ఎంత సహాయం చేస్తారో చెప్పవచ్చు.. అని ఆది అన్నాడు.

తిక్కరేగితే పాదయాత్ర చేస్తారు

తిక్కరేగితే పాదయాత్ర చేస్తారు


ఇక ఆయనను చాలా మంది శాఖలలో ఉన్న మంత్రులు రాజకీయ నాయకులు తిడుతున్నారు. వాళ్లకి వేరే శాఖలు ఎందుకు పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా తింటే శాఖ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. శాఖల పరువు తీస్తున్నారు. వారాహి బండి యాత్రను ఆపేస్తాను అన్నారు. ఆయన కనక తిక్కరేగితే పాదయాత్ర చేస్తారు. అప్పుడు కచ్చితంగా అందరికీ కాశి యాత్ర అంటూ ప్రత్యర్థి రాజకీయ నాయకులకు ఆది కౌంటర్ ఇచ్చాడు.

మీ అబ్బ గుర్తుకు వస్తాడు

ఇక ఆయన ప్యాకేజీలో తీసుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమికు లొంగుతాడు కానీ డబ్బుకు ఏమాత్రం లొంగడు. అలాగే ఆయనను దత్తపుత్రుడు అని కూడా అన్నారు. అదే నోటితో ఆయన అంజనీ పుత్రుడు అనిపించుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయనపై మాట్లాడేసి ఫేమస్ అవుదాం అని అనుకుంటారు. ఈసారి మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకు వస్తాడు చూసుకోండి అని హైపర్ ఆది గాటుగా మాట్లాడాడు.

నిలకడలేని రాజకీయం

చాలామంది నిలకడ లేని నాయకుడు అంటున్నారు. మీరు అందరు కూడా బిజినెస్ లు చేసి రాజకీయాలు చేయొచ్చు కానీ ఆయన ఏ బిజినెస్ లు లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా?. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రెస్ మీట్ పెట్టాల్సింది పోయి మీరు అమ్మనా బూతులు తిడుతున్నారు అది నిడక నిలకడ లేని రాజకీయం.. అని హైపర్ ఆది అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X