నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా.. లైవ్‌లో హీరోయిన్‌తో స్టార్ హీరో వ్యాఖ్యలు

భారతదేశంలో సినిమా ఒక మతమైతే , సినీతారలు ఇలవేల్పులు. అంతగా నటీనటులను ఆదరిస్తారు అభిమానులు. వారి స్టైల్, వేష భాషలు, బట్టలు ఇలా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తూ అనుకరిస్తారు. అందుకే సినీతారలు ఏం మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. వారు చేసే చిన్న తప్పు సమాజంపై పెను ప్రభావాన్ని చూపుతుంది, తర్వాత జరిగే పరిణామాలు ఊహకు కూడా అందవు.

భారతదేశంలో ఎన్నో భాషల్లో సినిమాలు తెరకెక్కుతుండగా.. వాటిల్లో పదుల సంఖ్యలో స్టార్స్ ఉన్నా .. ఒక్కడు మాత్రమే సదరు ఇండస్ట్రీని ఏలుతుంటాడు. అలా దశాబ్ధాలుగా బాలీవుడ్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్, కింగ్ రొమాన్స్ ఇలా పలు పేర్లతో ఆయనను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఇంతటి స్టార్‌డమ్ షారుఖ్ ఖాన్‌క రాత్రికి రాత్రే రాలేదు. ఛాన్సుల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు.. ముంబైలో నిలువ నీడ లేక బీచ్‌లో పడుకున్న రోజులూ ఉన్నాయి. పలు సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు కూడా వేశాడు.

I Can Make You Pregnant says shah Rukh Khan to Preity Zinta video goes viral

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సెకండ్ హీరోగా, విలన్‌గా ఇలా ఏ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా కెరీర్‌ను ప్లాన్ చేసుకున్నారు. ఈ దశలో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్- కాజోల్ జంటగా నటించిన దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన అద్భుత ప్రేమ కావ్యాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కథ, కథనం, పాటలు దేశాన్ని ఒక ఊపాయి. దీంతో షారుఖ్ ఖాన్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు.

నాటి నుంచి ఆయన వెనుదిరిగి చూడకుండా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో బాలీవుడ్‌కి, భారతీయ చిత్ర పరిశ్రమకు ఐకాన్‌గా మారారు. కరోనాతో పాటు సౌత్ సినిమాల ధాటికి బాలీవుడ్ డౌన్‌ఫాల్ స్టార్టయ్యింది. ఇక రేపో మాపో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు సౌత్ బాట పట్టకతప్పదని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. జవాన్, పఠాన్ వంటి మూవీస్‌తో హిందీ ఇండస్ట్రీని నిలబెట్టి పరువు కాపాడారు షారుఖ్ ఖాన్. 60కి దగ్గరవుతున్నా నేటికీ అదే ఎనర్జీతో కుర్ర హీరోలకే పోటీనిస్తున్నారు కింగ్ ఖాన్. గౌరీ ఖాన్‌ను ప్రేమించిన ఆయన తన పెళ్లిని హిందూ సాంప్రదాయంలో చేసుకున్నారు. తన ఇంట్లో హిందూ, ముస్లిం ఆచారాలను, పండుగలను నిర్వహిస్తూ అన్ని మతాలు తనకు సమానమేనని చాటి చెబుతున్నారు.

అలాంటి షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్‌ను అనకూడని మాట ఒకటి అన్నారు. సినీ నటి ప్రీతీ జింటా.. ఓ షోలో షారుఖ్‌ను ఇంటర్వ్యూ చేస్తూ .. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో షారుఖ్ .. మీరు ప్రెగ్నెంటా అని అడగ్గా ఆమె సిగ్గుపడుతూ ఫేస్‌ను కవర్ చేసుకుంటుంది. ఆ వెంటనే షారుఖ్ .. తాను నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా అని అనడంతో ప్రీతి షాక్‌కు గురై ఏం మాట్లాడాలో తెలియక నవ్వేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ స్టేటస్‌లో ఉండి , పెళ్లయిన మహిళతో ఆ మాటలేంటీ అంటూ మండిపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X