పూనమ్ కౌర్ ప్రైవేట్ విషయాలు తెలుసు.. బాంబు పేల్చిన పవన్ మాజీ ఫ్రెండ్
గత కొన్ని రోజులు నుంచి ఎప్పుడు లేని విధంగా టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు అందరిపై పలు ఆరోపణలు లేదా పలు కాంట్రవర్సీ లలో పేర్లు అలా వినిపిస్తూ వస్తున్న సంగతి అంతా చూస్తున్నారు. ఒకో కాంట్రవర్సీకి రిలేటెడ్ గా ఒకో పేరు వారికి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా బయటకు వినిపిస్తూ వైరల్ అవుతున్నాయి.
కాగా ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కాంట్రవర్సీ లలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు కూడా ఒకటి. కాగా ఈ కేసు వెలుగులోకి రావడంతో కొంతమంది ఇండస్ట్రీకి చెందిన ఆడవాళ్లు మాట్లాడ్డం స్టార్ట్ చేశారు. కాగా వీరిలో ప్రముఖ సింగర్ చిన్మయి రోజు ఈ కేసు విషయంలో ఏదొక కామెంట్స్ చేస్తుంది. అలాగే ఈమెతో పాటుగా నటి పూనమ్ కౌర్ కూడా సంచలనం రేపింది.

ఇలా జానీ మాస్టర్ కేసు వెలుగులోకి వచ్చిందో లేదో సినీ పరిశ్రమలో గురూజీ అంటూ చెలామణి అయ్యే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కూడా చర్యలు తీసుకోవాలని సంచలన పోస్టులు పెట్టింది. కాగా ఇక్కడ నుంచి పూనమ్ కౌర్ పై కూడా చాలా మంది మళ్ళీ దృష్టి పెట్టారు.
అయితే పూనమ్ ఆరోపణలు చేస్తుంది కానీ అందరిలానే కేసు పెడితే ఏదోకటి తెలుస్తుంది కదా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు కానీ కేసు ఏమో కానీ రోజు మాత్రం పూనమ్ కౌర్ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో త్రివిక్రమ్ సహా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా తన పేరు ఎత్తకుండా సంచలన పోస్ట్ లు చేస్తుంది. కాగా ఈ అంశంపైనే పవన్ కి ఒకప్పుడు బాగా సన్నిహితుడు ఇప్పుడు స్నేహితుడుగా మారిన రాజు రవితేజ చేసిన పలు కామెంట్స్ షాకింగ్ గా మారాయి.
పూనమ్ కౌర్ అలాగే త్రివిక్రమ్ సహా పవన్ ల విషయంలో అప్పట్లో కొన్ని ప్రైవేట్ విషయాలు నాకు తెలుసు అని కానీ నేను పబ్లిక్ లో ఓపెన్ గా చెప్పడానికి లేదు అన్నట్టుగా తాను తెలిపాడు. అలాగే పూనమ్ కౌర్ దగ్గర నిజంగా అధరాలు ఉంటే వాటిని ఆమె బయట పెడితే అప్పుడు మనం మాట్లాడ్డానికి ఏమన్నా ఉంటుంది.
పూనమ్ చాలా సార్లు పవన్ కళ్యాణ్ పేరు కూడా మెన్షన్ చేసింది కానీ ఇండస్ట్రీలో పొలిటికల్ గా పవర్ఫుల్ వ్యక్తులు సో వారు చెప్పిందే వేదం, వారి చేతిలో చాలా మంది జీవితాలు ఉన్నాయి. వాళ్ళు ఉన్న సిస్టం వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది కానీ పూనమ్ చెయ్యదు అంటూ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
మరి నిజంగానే పూనమ్ కౌర్ దగ్గర ఆధారాలు ఉండుంటే ఈ పాటికి బయట పెట్టో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏదొక యాక్షన్ అయితే జరిగి ఉండడంతో అట్లీస్ట్ న్యూస్ లోకి రావడమో అన్నా జరిగేది కదా కానీ పూనమ్ మాత్రం ఇంకా సోషల్ మీడియాకే పరిమితం అయ్యి ఆరోపణలు చేస్తే ఏంటి లాభం అని కొందరు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











