‘32 కోట్లు నష్టపోయా.. జూ ఎన్టీఆర్ మూవీ అట్టర్ ఫ్లాప్‌తో అంత దారుణం’
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం వార్ 2 నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద జర్నీని కొనసాగిస్తున్నది. హిందీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రంపై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోవడంతో కలెక్షన్లపై భారీ ప్రభావం చూపుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకోవడం వల్ల ఆడియెన్స్ నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తోపాటు నిర్మాత నాగవంశీను ట్రోల్స్‌తో భారీగా ఎటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమాలను లిస్టు తీసి.. ఆయన ప్రతికూల వర్గం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నది. ఈ క్రమంలో నిర్మాత సీ అశ్వినీదత్ చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
జూ.ఎన్టీఆర్‌ను అమితంగా అభిమానించే నిర్మాత నాగవంశీ గతంలో దేవర సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి భారీ లాభాలను రాబట్టారు. అయితే తనపై, తారక్ సినిమాపై ఉన్న నమ్మకంతో వార్ 2 చిత్రాన్ని రికార్డు ధరను వెచ్చించి ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను సొంతం చేసుకొన్నారు. ఈ సినిమాను సుమారుగా 105 కోట్ల రూపాయలు చెల్లించి తెలుగు రాష్ట్రాల్లో హక్కులను సొంతం చేసుకొన్నారు.

అయితే వార్ 2 చిత్రంపై నిర్మాత నాగవంశీ అత్యధికంగా నమ్మకం పెట్టి.. ప్రమోషన్స్ కూడా అదిరిపోయేలా చేశారు. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి తారక్ ఫ్యాన్స్ జోష్ పుట్టించే ప్రసంగం చేశారు. తారక్ అన్న స్టామినాను తెలుగు వారు చూపించాలి. హిందీలో వచ్చే కలెక్షన్ల కంటే తెలుగులో వచ్చే వసూళ్లు ఎక్కువగా ఉండేలా రాబట్టాలి అంటూ కామెంట్ చేశారు. దాంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో అధికంగా కలెక్షన్లు రాబట్టాలనే ప్రయత్నం చేశారు. అయితే రిలీజ్ తర్వాత పరిస్థితి తారుమారైంది. ఎన్టీఆర్ కెరీర్‌లో మరో భారీ డిజాస్టర్‌గా మారిందనే టాక్ వినిపిస్తుంది.
అయితే ఎన్టీఆర్‌ను ట్రోల్ చేసే నెటిజన్లు.. గతంలో జరిగిన విషయాలను ప్రస్తుతం ప్రస్తావించి మరింత నెగిటివిటిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన నరసింహుడు సినిమా డిజాస్టర్ తర్వాత నిర్మాత ఏకంగా హైదరాబాద్‌లోని హుస్పేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేశారు. ఆ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టడంతో ఆయన డిప్రెషన్స్‌లోకి వెళ్లారు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఇక శక్తి సినిమా గురించి సీ అశ్వినీదత్ చేసిన కామెంట్స్ ఈ సందర్భంగా షేర్ చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో సీ అశ్వినీదత్ మాట్లాడుతూ.. శక్తి సినిమా. ఒక్క సినిమాతో 32 కోట్లు పోయాయి. ఏకంగా 32 కోట్ల పోవడంతో చాలా షాకింగ్ అనిపించింది. అందుకే నాలుగైదు సంవత్సరాలు సినిమా తీయలేదు. మళ్లీ సినిమాలు తీయాలని అనిపించలేదు అని అన్నారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ను తాజాగా షేర్ చేసి ఎన్టీఆర్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
వార్ 2 సినిమా విషయానికి వస్తే.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా తెలుగు రైట్స్ 105 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. ఈ సినిమా తెలుగులోనే తక్కువలో తక్కువ 50 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











