‘ప్రభాస్ నా కొడుకుగా పుట్టాలని కోరుకొంటున్నా.. మరో జన్మంటూ ఉంటే’
సినిమా పరిశ్రమలో స్టార్ డమ్‌తోపాటు యాటిట్యూడ్ కూడా ప్రదర్శించడం కొందరు హీరోలకు అలవాటు అనేది పలు సందర్భాల్లో దృష్టికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంత ఒదిగినా అణుకువగా ఉండటం కొంతమంది హీరోలకే చెల్లింది. అలా పాన్ ఇండియా స్టార్‌గా మారిన గ్రౌండ్ టు ఎర్త్ యాటిట్యూడ్‌తో వ్యవహరించే వారిలో ప్రభాస్ ఒక్కరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదంటారు సినీ వర్గాలు. అందుకే ప్రభాస్‌ను ముద్దుగా అందరూ డార్లింగ్ అని పిలుచుకొంటారు. అయితే తాజాగా ప్రముఖ నటి.. ప్రభాస్ ఆకాశానికి ఎత్తివేస్తూ తన గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..
ఇండస్ట్రీలో ప్రభాస్‌కు సౌమ్యుడు, స్నేహశీలి అనే పేరుంది. సెట్లో ప్రొఫెషనల్‌గా కాకుండా వ్యక్తిగతంగా కూడా అందరితో కలిసి మెలిసి ఉంటారని తోటి ఆర్టిస్టులు పలు సందర్భాల్లో చెప్పుకోవడం తెలిసిందే. అయితే ముఖ్యంగా షూటింగులో మంచిచెడులను చూసుకొంటూ ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పుకొంటారు. తొలి సినిమా నుంచి స్టార్ ఎదిగినా కానీ ఆ ప్రవర్తనలో మార్పు రాలేదని చెప్పుకొంటారు.

అయితే ప్రభాస్ ముఖ్యంగా భోజనప్రియుడు. తాను ఇష్టంగా ఆహార పదార్థాలను, నాన్ వెజ్ తీసుకోవడమే కాకుండా తన తోటి వారికి కడుపు నిండా భారీగా భోజన సదుపాయం కలిగిస్తారని చెబుతారు. గతంలో పృథ్వీరాజ్ సుకుమార్ కూడా సలార్ షూటింగు సందర్భంగా తన కుటుంబానికి కోసం పది మందికి సరిపడేలా డిఫరెంట్ మెనుతో ఫుడ్ పంపించడాన్ని చెప్పి ఆశ్చర్యపోయారు.
తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వాహెబ్ కూడా ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తాను రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నాను. అయితే ప్రభాస్ లాంటి మనిషిని మరోకరిని చూడలేదు. అతడు ఎంత మంచి వాడంటే.. వచ్చే జన్మ ఉంటే నాకు ఇద్దరు కొడుకులు పుట్టాలని కోరుకొంటాను. ఒకరు ప్రభాస్.. మరొకరు సూరజ్. ప్రభాస్ లవ్లీ పర్సన్ అంటే.. అందరితో కలుపుగోలుగా ఉంటారు అని ఆమె అన్నారు.
రాజా సాబ్ సెట్‌లో నా ఒక్కరితోనే కాదు.. అందరితోను మంచి మాట్లాడుతారు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. తన షూట్ అయిపోయినా.. లేదా ప్యాకప్ అయినా అందరి వద్దకు వచ్చి గుడ్ బై చెబుతాడు. అందరికి అలా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆయన తన సీన్స్ షూట్ లేకుంటే.. కారవాన్‌లోకి వెళ్లరు. షూటింగ్ లొకేషన్‌లోనే కూర్చొంటారు అని జరీనా వాహెబ్ చెప్పారు.
ఇక ఇదిలా ఉంటే.. ఎవరికైనా ఆకలిగా ఉందని చెబితే చాలూ.. ఇంటికి ఫోన్ చేసి.. 40, 50 మందికి భోజనం తెప్పించి అందరికి తినిపిస్తాడు. అలాంటి అతిథి మర్యాదలు చేసే హీరోను నా జీవితంలో చూడలేదు. ఆయన దేవుడు మంచి ఆరోగ్యం, ఆయుష్షు, భవిష్యత్ ఇవ్వాలని కోరుకొంటాను అని జరీనా వాహెబ్ ఎమోషనల్ అయ్యారు.

జరీనా వాహెబ్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణతో గాజుల కిష్టయ్య, కమల్ హాసన్‌తో అమర ప్రేమ, ఏఎన్నాఆర్‌తో హేమా హేమీలు, ఇటీవల రక్త చరిత్ర 2, విరాట పర్వం, దసరా, దేవరా సినిమాల్లో నటించారు. బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి భార్యగా, సూరజ్ పంచోలి తల్లిగా సుపరిచితులు. ఆమె తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు.
ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. రాజా సాబ్ సినిమా షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేసుకొన్నారు. సలార్ 2, కల్కి 2, స్పిరిట్, బ్రహ్మ రాక్షసుడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంకా పలు చిత్రాల్లో నటించేందుకు అంగీకారం తెలిపారు. రాజా సాబ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











