రజనీకాంత్ పీకల మీదకి తెచ్చిన టాలీవుడ్ సింగర్.. జీవితంలో పెద్ద తప్పంటూ ఎమోషనల్

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్య బస్ కండక్టర్ నుంచి స్టార్ హీరోగా, తమిళనాడుకు కల్చరల్ ఐకాన్‌గా ఎదిగారు రజనీ. కోట్లాది మంది అభిమానులు, కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నా ఆయన అతి సాధారణ జీవితం గడుపుతారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా తలైవా అభిమానులే. అలాంటిది తన వీరాభిమాని అయిన ఓ స్టార్ సింగర్ కారణంగా రజనీకాంత్ చిక్కుల్లో పడ్డారు . ఈ వివరాల్లోకి వెళితే :

గల్లీ స్థాయి నుంచి ఏకంగా ఆస్కార్ వేదిక వరకు ఏదిగారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఓ ఛానెల్‌లో ప్రసారమైన సింగింగ్ కాంపిటీషన్ ద్వారా రాహుల్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆయన టాలెంట్‌ని గుర్తించిన కొందరు సంగీత దర్శకులు ప్లే బ్యాక్ సింగర్‌గా అవకాశాలు కల్పించారు. తనదైన గాత్రంతో ఎన్నో హిట్ సాంగ్స్ పాడి అలరించిన ఆయనకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ సింగర్ అయినప్పటికీ గల్లీలోని కుర్రాళ్లతో మమేకం అవ్వడం ఆయన మంచితనానికి నిదర్శనం.

I was Made mistake against Rajinikanth says Singer Rahul sipligunj

ఈ పాపులారిటీతోనే రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ తెలుగులో అవకాశం దక్కించుకున్నారు. తన ఆటతీరు, టాస్క్‌లలో నైపుణ్యంతో ఏకంగా శ్రీముఖి లాంటి స్టార్ యాంకర్‌ను వెనక్కినెట్టి బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచారు రాహుల్ సిప్లిగంజ్. ఈ షోతో ఆయన తెలుగు లొగిళ్లకు బాగా దగ్గరయ్యారు. రాహుల్ క్రేజ్ సైతం తారా స్థాయికి చేరడంతో సింగర్‌ గానూ, యాక్టర్‌గానూ పెద్ద ఎత్తున అవకాశాలు దక్కాయి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ లాంగ్ గ్యాప్ తర్వాత తీసిన రంగమార్తండలో కీలకపాత్ర పోషించారు రాహుల్. తనలో సింగరే కాదు అద్భుతమైన నటుడు కూడా ఉన్నాడని నిరూపించారు రాహుల్ సిప్లిగంజ్. తెలుగులో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి వాటికి క్రేజ్ తీసుకొచ్చిన అతికొద్ది మంది ప్లే బ్యాక్ సింగర్స్‌లో ఒకరిగా ఆయన పేరు సంపాదించుకున్నారు.

అన్నింటిలోకి ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ స్టేజ్‌పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అరుదైన అవకాశాన్ని అందుకున్నాడు రాహుల్. ఆ వేదికపై అడుగుపెట్టాలని ఎంతో మంది నటీనటులు , సాంకేతిక నిపుణుల జీవితకాలం కల. దానిని చిన్నవయసులోనే అందుకున్నారు రాహుల్ సిప్లిగంజ్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది. ఈ క్రమంలోనే రాహుల్ ఆస్కార్ స్టేజ్‌పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

అలాంటి రాహుల్ సిప్లిగంజ్ జీవితంలో ఒక పెద్ద తప్పు చేశారట. అది కూడా సూపర్‌స్టార్ రజనీకాంత్ విషయంలో. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ.. రంగమార్తండ షూటింగ్ సమయంలో ప్రకాష్ రాజ్- రమ్యకృష్ణలతో తనకు రిలేషన్ బలపడిందని, ఈ క్రమంలో తాను రజనీకాంత్ ఫ్యాన్‌ని అన్న విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ .. ఓ రోజున రజనీ దగ్గరకు వెళ్తున్నానని చెప్పి నన్ను కూడా పిలిచారని రాహుల్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు అన్నాత్తే షూటింగ్ జరుగుతుండటంతో రజనీకి నన్ను పరిచయం చేశారని, తాను వెంటనే ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు.

తలైవాతో ఓ ఫోటో దిగానని, అయితే సినిమాకి సంబంధించిన లుక్ ఇంకా రిలీజ్ చేయలేదని అందువల్ల ఈ ఫోటోను సినిమా రిలీజయ్యే వరకు షేర్ చేయొద్దని స్వయంగా రజనీ చెప్పారని రాహుల్ వెల్లడించారు. కానీ రజనీతో తాను ఫోటో దిగిన విషయాన్ని షేర్ చేసుకోవాలనే తొందరలో ఓ రోజున దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్ అయ్యిందని తెలిపారు. దీంతో అన్నాత్తే చిత్ర నిర్మాణ సంస్థ టెన్షన్ పడిందని, తప్పు గమనించి దానిని వెంటనే డిలీట్ చేసేశానని.. కానీ అది జీవితంలో తాను తెలిసి చేసిన తప్పని రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: rajinikanth rahul sipligunj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X