For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nani : వాళ్ళన్న దాన్లో తప్పు లేదు.. వాళ్లు బ్యాన్ చేయడం కాదు.. నన్ను నేనే బ్యాన్‌ చేసుకుంటా!

  |

  నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. లవ్ స్టోరీ సినిమా కూడా అదే రోజున విడుదల తేదీ ప్రకటన చేయడంతో నాని సినిమా విషయంలో పెద్ద కలకలం చెలరేగింది. లవ్ స్టోరీ నిర్మాతగా ఉన్న సునీల్ నారంగ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన డిస్ట్రిబ్యూటర్లందరూ రంగంలోకి దిగి నాని సినిమా మీద అనూహ్య ఆరోపణలు చేశారు. ఒకరిద్దరు డిస్ట్రిబ్యూటర్లు అయితే నాని సినిమాని ఎందుకు బ్యాన్ చేయకూడదు అని ప్రశ్నిస్తూనే ఇలాంటి విషయాలలో బ్యాన్ చేయడానికి కూడా వెనకాడము అని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద నాచురల్ స్టార్ నాని ఆసక్తికరంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

  ఆమెజాన్లో సిద్దం

  ఆమెజాన్లో సిద్దం


  నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్మాణ దర్శకత్వంలో రీతువర్మ హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం జగదీష్. పేరుతో విభిన్నమైన సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలో జగపతి బాబు, ప్రవీణ్, తిరువీర్ లాంటి నటులు నటించారు. ఈ సినిమా వాస్తవానికి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకు పడుతున్న నేపథ్యంలో అప్పటికే ఆంక్షలు విధిస్తూ ఉండడంతో థియేటర్లను మూసివేయాలని ఆదేశాలు లేక పోయినా ఈ సినిమాను వాయిదా వేశారు. పరిస్థితులు కుదుటపడ్డాక విడుదల చేయాలి అనుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ నైట్ కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.

  అందుకే అలా

  అందుకే అలా

  అలాగే టికెట్ రేట్ల విషయంలో కూడా థియేటర్ల యజమానులు ఏ మాత్రం ఆనందించదగ్గ రేట్లు ప్రస్తుతానికి లేవు. అందుకే పెద్ద సినిమాల వాళ్ళు అందరూ కూడా థియేటర్లలో సినిమాలు విడుదల చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి. ఇలాంటి సమయంలో ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ నుంచి మంచి ఆఫర్లు లభించాయి. అయితే నాని ఎలా అయిన ఈ సినిమా ధియేటర్ లోనే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ముందు నుంచి ఉన్నాడు. ఆయన చేసిన చివరి చిత్రం కూడా థియేటర్లో విడుదల కాకుండా అమెజాన్ ప్రైమ్ ద్వారానే విడుదలైంది. ఆ సినిమా విడుదల చేయడానికి చేసిన ప్రకటన సమయంలో నాని టక్ జగదీశ్ సినిమా కచ్చితంగా థియేటర్ లోనే వస్తుంది, అప్పుడు థియేటర్ లో కలుద్దాం అని చెప్పుకొచ్చాడు.

  ఏమైంది అంటే

  ఏమైంది అంటే

  కానీ పరిస్థితులు తారుమారు కావడం నిర్మాతలకు ఫైనాన్షియల్ ప్రెజర్ పెరగడంతో వాళ్ళు నాని మీద ఒత్తిడి తెచ్చారు. అనేక తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మి వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒకసారి వేరే సంస్థకు సినిమానమ్మేస్తే ఇక ఆ సినిమా మీద హక్కులు పూర్తిగా లేకుండా పోతాయి. అలా అమెజాన్ సంస్థ సినిమాను కొనుక్కుని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక వచ్చిన చిక్కల్లా ఏమంటే అంతకు ముందే లవ్ స్టోరీ యూనిట్ కూడా తమ సినిమాని సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నామని ప్రకటించింది. తమ సినిమా రిలీజ్ డేట్ చూశాక కూడా అమెజాన్ వాళ్ళు ఇలా ఎలా రిలీజ్ చేస్తారు వాళ్ళు అలా రిలీజ్ చేస్తుంటే మీరు అలా ఎలా చూస్తున్నారు అంటూ నాని మీద ఒక రకంగా యుద్ధాన్ని ప్రకటించినట్లు సునీల్ నారంగ్ కు మద్దతుగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడారు.

  నా మీద నేనే విధించుకుంటా

  నా మీద నేనే విధించుకుంటా

  ఈరోజు నాని టక్ జగదీష్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన మీడియా మిత్రులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మీ మీద ఈ కామెంట్స్ వచ్చాయి కదా మీరేమంటారు అనగా నాని చాలా హుందాగా సమాధానమిచ్చాడు. అసలు ఆ పెద్ద వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఏ మాత్రం తప్పు లేదని వారు ఉన్న పరిస్థితుల్లో అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనే విషయం తాను అర్థం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఒకవేళ తాను ఆ పరిస్థితుల్లో ఉన్న అలాగే మాట్లాడతానని అందులో తప్పేమీ లేదని అన్నాడు. అలాగే అన్ని పరిస్థితులు బాగుండి అప్పుడు కూడా నేను నా సినిమా ధియేటర్లో కాకుండా ఇలా డిజిటల్ మీడియా లో విడుదల చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు నా మీద బ్యాన్ విధించడమె కాదు నా మీద నేనే బ్యాన్ విధించుకుంటానని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  నానిని అలా అంటారా?

  నానిని అలా అంటారా?

  ఇక ఈ సినిమా కొత్త సినిమా అని నేను చెప్పను అని గతంలో మన చూసిన సినిమాలనే మళ్లీ చూస్తున్నామని భావన కలుగుతుందని ఒక రకంగా అలనాటి జ్ఞాపకాల దొంతరను దగ్గరకు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. ఒకరకంగా ఇది మనందరికీ తెలిసిన కథ, కానీ మేము ఎలా చెప్పాము అనేదే ముఖ్యం అని నాని చెప్పుకొచ్చాడు. శివ నిర్వాణ నానీ గురించి ఇలా మాట్లాడడం తప్పు అని అంటూనే నాని ప్రతి సినిమాకు 8 గంటల 45 నిమిషాల షోకి ప్రసాద్ ఐమాక్స్ కి వెళ్లి రెండున్నర గంటల సినిమాని నుంచుని చూస్తాడని నానికి సినిమా అంటే అంత పిచ్చి అని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద తల మీద వచ్చిన ఆరోపణలకు నాని స్పందన హుందాగా ఉందని చెప్పక తప్పదు.

  English summary
  Natural star Nani has responded to the concluded controversy of his upcoming movie ‘Tuck Jagadish’ getting an OTT release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X