ఆయనకే నా ఓటు, బూతులు తగ్గించమని సలహా : విజయ్ దేవరకొండ బోల్డ్ కామెంట్

Recommended Video

Vijay Deverakonda Speech @Nota Pre Release Event

'నోటా' చిత్రం తెలుగు, తమిళంలో విడుదలవుతుండటంతో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలో గ్యాప్ లేకుండా పర్యటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. చెన్నైలో మీడియా ఇంటర్వ్యూలు ముగించుకుని తెలుగు రాష్ట్రాలకు వచ్చి విజయవాడ, హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. బుధవారం బెంగుళూరు వెళ్లి అక్కడ కూడా సినిమాను ప్రమోట్ చేశారు. గురువారం మళ్లీ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన అంశాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎదురైన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ బోల్డ్‌గా సమాధానాలిచ్చారు.

మీ ఓటు ఎవరికి వేస్తారు?

మీ ఓటు ఎవరికి వేస్తారు?

‘నోటా' సినిమా పొలిటికల్ థ్రిల్లర్ కావడం, తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, త్వరలో ఇక్కడ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండకు ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీరు ఎవరికి ఓటేస్తారు? అనే ప్రశ్నకు స్పందిస్తూ... గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేశాను. ఇపుడు కూడా అదే పార్టీకి వేస్తాను. నాకు కేటీఆర్ ఐడియాలజీ అంటే చాలా ఇష్టమని విజయ్ బోల్డ్‌గా చెప్పేశారు.

నోటా బటన్ చూడలేదు

నోటా బటన్ చూడలేదు

తాను నోటా బటన్ ఇప్పటి వరకు చూడలేదని ఈ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం ఇచ్చారు.

బూతులు తగ్గించుకోమని సలహా

బూతులు తగ్గించుకోమని సలహా

ఒకసారి చెన్నై వెళ్తున్నప్పుడు ఫ్లైట్‌లో ఒక పెద్దాయన కలిసాడు. "బాబు నీ సినిమాలంటే నాకు, మా అమ్మాయిలకు చాలా ఇష్టం. కానీ.. కాస్త బూతులు తగ్గించండి" అని రిక్వెస్ట్ చేసాడు. ఆయన ఇచ్చిన సలహా నాకు ఇప్పటికీ గుర్తుంది, అది నాకు ఎంతో నచ్చిందని విజయ్ స్పష్టం చేశారు.

విదేశీ గర్ల్ ఫ్రెండ్ గురించి

విదేశీ గర్ల్ ఫ్రెండ్ గురించి

విజయ్ దేవరకొండ ఒక విదేశీ అమ్మాయితో ఉన్న ఫోటోలు ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ ఫ్యామిలీతో కూడా ఆమె ఫోటోల్లో ఉన్నారు. ఈ విషయమై ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించగా... ఆ అమ్మాయి నా ఫ్యామిలీలో భాగం కావాలని మీ అమ్మాయిలంతా కోరుకుంటున్నారా? అంటూ నోటా స్టార్ ఎదురు ప్రశ్నవేశాడు. అదే నిజమైతే చాలా మంది నా గర్ల్ ఫ్యాన్స్‌కు నచ్చక పోవచ్చు అని బెంగుళూరు మీడియా సమావేశంలో విజయ్ వ్యాఖ్యానించారు.

గీత గోవిందం సినిమాలోని ముద్దు సీన్ వల్లే రష్మిక-రక్షిత్ మధ్య బ్రేకప్ అయిందా?

గీత గోవిందం సినిమాలోని ముద్దు సీన్ వల్లే రష్మిక-రక్షిత్ మధ్య బ్రేకప్ అయిందా?

గీత గోవిందం సినిమాలోని ముద్దు సీన్ వల్లే రష్మిక-రక్షిత్ మధ్య బ్రేకప్ అయిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మీరేమంటారు? అనే ప్రశ్నకు విజయ్ స్పందిస్తూ... వారిద్దరి రిలేషన్ విషయంలో అలా జరుగడం బాధాకరం. దీని వల్ల ఇద్దరూ పర్సనల్‌గా ఎంత ఎఫెక్ట్ అయ్యారో తెలుసు. ఇద్దరు వ్యక్తుల ప్రైవేట్ విషయంలో నేను మాట్లాడటం సరికాదని నా అభిప్రాయం. వారిద్దరిపై నాకు రెస్పెక్ట్ ఉంది. నాకు రక్షిత్ వర్క్ అంటే చాలా ఇష్టం. కోస్టార్‌గా రష్మిక అంటే ఇష్టం. అందుకే ఈ విషయమై నేను మాట్లాడదలుచుకోలేదు. సీన్ లీక్ అవ్వడం అనేది దురదృష్టకరం అని విజయ్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X