IBomma రవి అరెస్ట్.. సజ్జనార్‌తో చిరంజీవి, రాజమౌళి, నాగార్జున కీలక భేటీ.. అసలేం జరిగిందంటే?

IBomma Ravi Arrested: సినీ ఇండస్ట్రీని సంవత్సరాలుగా కుంగదీస్తున్న వైరస్ ఫైరసీ. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలను క్షణాల్లో ఫైరసీ చేసి మేకర్స్ నష్టపరుస్తుంది. సినీ ప్రపంచానికి మహమ్మారి లా మారిన పైరసీ వైరస్ ను ఛేదించేందుకు ప్రభుత్వాలు, సినీ ప్రముఖులు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ ప్రతి ఫలం దక్కలేదు. కానీ ఈసారి సైబర్ క్రైమ్ పోలీస్ టీమ్ శ్రమించి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో సీపీ వీసీ సజ్జనార్ ను టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, దర్శక ధీరుడు రాజమౌళి మొదలైన వారు భేటీ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే ..?

ఎన్నో వెబ్‌సైట్లు బ్లాక్ చేసినా, కొత్త పేర్లు పెట్టుకుని మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్న పైరసీ ప్లాట్‌ఫారమ్‌లకు మూలం ఎవరో గుర్తించారు. ఫైరసీ కింగ్ గా చెప్పుకునే ఐ బొమ్మ ఓనర్ ఇమ్మడి రవిని చాలా చాకచక్యంగా తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతని చేతనే ఆ వెబ్ సైట్స్ ను క్లోజ్ చేయించి పోలీసులు తమ సత్తా చాటుకున్నారు. ఇలా ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపింది.

IBomma Owner Imandi Ravi Arrested Chiranjeevi Rajamouli Nagarjuna Meet CP Sajjanar

రవిపై గత నెల నుంచే నిఘా పెట్టిన పోలీసులు, అక్టోబర్ 1 నుంచి అతడి కదలికలను ట్రాక్ చేస్తూ, శనివారం ఉదయం కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌ నుంచి అరెస్ట్ చేశారు. రవిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రవిని మరింతగా విచారణ చేయడానికి 7 రోజుల కస్టడీ కోరుతూ సైబర్ క్రైమ్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు రవి ఇంట్లో వందల హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లను, వెబ్‌సర్వర్ లాగిన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

పైరసీ ద్వారా అతడు సంపాదించినట్లు భావిస్తున్న రూ. 3 కోట్ల నగదును బ్యాంకుల్లో ఫ్రీజ్ చేశారు. విదేశాలకు IP అడ్రెస్‌లు మార్చి సినిమా ఫైళ్లు పంపిన ఆధారాలు కూడా లభించాయి. 2018 నుంచి యూకేలో కూడా రవి టీమ్ నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. రవి రెయిన్‌బో విస్టా ఫ్లాట్‌ను ఏళ్ల క్రితమే కొనుగోలు చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటిస్తూ, తన అసలు పనులను దాచిపెట్టి, పైరసీ నడిపినట్లు బయటపడింది.

రవిని అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, దర్శక ధీరుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. పైరసీ వల్ల పరిశ్రమ పడుతున్న భారీ నష్టంపై, ఇకపై ఇలాంటి నేరాలను పూర్తిగా అరికట్టాలనే దిశగా సినిమా ఇండస్ట్రీ , పోలీసు శాఖ కలిసి పనిచేయాలని చర్చించారు. సజ్జనార్ "ఇది ఒక్కరిని పట్టుకోవడం కాదు, మొత్తం పైరసీ మాఫియాకు ఇచ్చిన వార్నింగ్" అని స్పష్టం చేశారు.

ఇప్పటికే IBomma మాత్రమే కాకుండా, రవి నిర్వహిస్తున్న మరో వెబ్‌సైట్ Beppam TV కూడా బ్లాక్ చేయబడింది. రవి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించగా, ఇప్పటి వరకు అతను సంపాదించిన డబ్బులు ఎక్కడ దాచి పెట్టాడనే దానిపై, అతని వెనుక మరెవరైనా ఉన్నారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X