అల్లు అర్జున్ రేర్ ఫీట్ .. ఇండియాలో తొలి హీరోగా ఐకాన్‌స్టార్.!
మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో ఆయన కుటుంబం నుంచి డజను మంది హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి రాణిస్తున్నారు. తొలుత నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు చిరు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. తర్వాతి తరంలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కుమారుడు, దివంగత అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.
ఈ దశలో ఆర్యతో యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించారు. బన్నీ, హ్యాపీ, దేశముదురు చిత్రాలతో స్టైలీష్ స్టార్‌గా ఎదిగారు. ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు. నటన, డైలాగ్స్, ఫైట్స్‌తో పాటు ఈ జనరేషన్ తెలుగు హీరోల్లో డ్యాన్స్‌కు ఐకాన్‌గా మారారు. ఎలాంటి రిస్కీ స్టెప్స్ అయినా సరే అలవోకగా చేస్తూ మేనమామ చిరంజీవి వారసత్వాన్ని నిలబెట్టారు. పరుగు, వరుడు, బద్రీనాథ్, రుద్రమదేవి వంటి విలక్షణ చిత్రాలలోనూ నటించి తనలోని కొత్త కోణాన్ని చూపించారు.

రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠపురం చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ కెరీర్‌ను పుష్ప సిరీస్ మలుపు తిప్పింది. గంధపు చెక్కల స్మగ్లర్‌గా , డీ గ్లామర్ రోల్‌లో అల్లు అర్జున్ నటన హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఆయనను భారత ప్రభుత్వం సత్కరించింది. అంతేకాదు ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డుల్లోకెక్కారు అల్లు అర్జున్.
ఇక పుష్పకు సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప 2తో అల్లు అర్జున్ సంచలనం సృష్టించాడు. దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో టాప్ 3లో నిలిచింది. తొలి వారంలోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో పాటు స్త్రీ 2, కల్కి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పఠాన్, జవాన్, యానిమల్ వంటి భారీ బ్లాక్ బస్టర్ల రికార్డులను బద్దలు కొట్టాడు అల్లు అర్జున్. త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో బన్నీ నటిస్తున్నారు.
తాజాగా అల్లు అర్జున్ ఘనత ఏకంగా హాలీవుడ్‌కు పాకింది. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ .. రీసెంట్‌గా ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో భారతదేశంలోనూ కాలుపెట్టనుంది. ఈ తొలి సంచిక కవర్ పేజీపై అల్లు అర్జున్ ప్లేస్ దక్కించుకున్నాడు. తద్వారా ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా బన్నీ నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటో షూట్ పూర్తి కాగా.. బ్లాక్ డ్రెస్ కూర్చొని కళ్ల జోడుతో స్టైలీష్ లుక్‌లో ఐకాన్ స్టార్ మెరిసిపోతున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా.. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కోసం అల్లు అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











