Pushpa Part 3: గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్.. అదే జరిగితే చరిత్ర సృష్టించనట్లే!
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు చాలా మంది హీరోలు పాన్ ఇండియా రేంజ్‌లో హవాను చూపిస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుని గ్లోబల్ రేంజ్‌కు ఎదిగిపోయారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ఫ ది రైజ్' చిత్రంతో అతడు సంచలన విజయాన్ని అందుకుని బడా స్టార్‌గా ఎదిగాడు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన 'పుష్ప ది రైజ్' మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప రాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి బడా వ్యాపారిగా మారి ఎలా రూల్ చేశాడన్న అంశంపై ఈ చిత్రం రాబోతుంది. దీంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి.

బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో రాబోతున్న 'పుష్ప ది రూల్' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో జోష్‌తో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేశారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీ విడుదల కాకముందే.. దీనికి కొనసాగింపుగా మరో చిత్రాన్ని కూడా వీళ్లు తీయబోతున్నట్లు ఇటీవలే న్యూస్ లీకైంది. అంతేకాదు, దీనికి 'పుష్ప ది రోర్' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ అదిరిపోయే గుడ్ న్యూస్‌ను పంచుకున్నాడు.
ఓ మీడియా సంస్థతో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'ఇప్పుడు మా ఫోకస్ మొత్తం పుష్ప ది రూల్ మీదనే ఉంది. దీన్ని త్వరగా పూర్తి చేసేందుకు డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఎలాగైనా ఆగస్టు 15కి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది చివరి దశకు వచ్చిన తర్వాత పుష్ప మూడో పార్ట్‌పై ఆలోచిస్తాం. ఇది లేట్ అవ్వొచ్చు కానీ కచ్చితంగా ఉంటుంది' అని స్పష్టం చేశాడు.

ఇదిలా ఉండగా.. 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్నిఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











