హిందీ చిత్రసీమపై తెలుగు సినిమాల డామినేషన్.. పుష్పరాజ్ దెబ్బకు ఆల్ సెట్!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు సినిమా, వెబ్ సిరీస్ లు, సినీ తారలపై సర్వేలు చేస్తూ సరైన ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఎప్పుడూ టాప్ లో ఉన్న సినిమాలు ఏవో కూడా చెబుతుంది. కేవలం విడుదల అయ్యాకే కాకుండా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న చిత్రాలతో పాటు అంతా ఎదురు చూస్తున్న సినిమాల గురించి వెల్లడిస్తుంటుంది. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ హిందీ ప్రజలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల లిస్టును విడుదల చేసింది.
అయితే ఈ లిస్టులో టాప్ 1లో తెలుగు సినిమా ఉండడం గమనార్హం. హింద్రీ చిత్ర సీమపై తెలుగు సినిమాలు హవా చేస్తున్నాయడానికి దీనికంటే గొప్ప ఉదారహరణ లేదు. అయితే మోస్ట్ అవైటెడ్ టాప్ 5 సినిమాలో లిస్టులో మొదటి స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 నిలిచింది. హిందీ ప్రజలు అందరూ ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మరి మిగతా స్థానాల్లో ఏయే చిత్రాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2024 జులై నెలలో హిందీ ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్న టాప్ 5 సినిమాల్లో నెంబర్ వన్ స్థానంలో పుష్ప 2 ఉంది. చాలా రోజులుగా ఈ సినిమాలోనే టాప్ 1లో ఉంటూ వస్తోంది. 2021లో వచ్చిన పుష్ప సినిమా.. ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వసూళ్లు సాధించిన ఈ సినిమాకు పార్ట్ 2 కోసం కూడా పెద్ద ఎత్తునే ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప : ది రూల్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక బాలీవుడ్ సినీ ప్రియులు అంతా ఎదురు చూస్తున్న చిత్రాల్లో టాప్ 2లో హేరా ఫేరి 3 లనిలిచింది. నీరజ్ వోరా డైరెక్షన్ లో రాబోతున్న ఈ కామెడీ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టాప్ 3లో ల్ భూలయ్య 3 చిత్రం నిలిచింది. ఇక ఈ సిరీసులో వచ్చిన రెండు చిత్రాలు హిట్ అవ్వగా ఇప్పుడు మూడో చిత్రం రాబోతుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే నమోదు అయ్యాయి. ఈక్రమంలోనే అనేక మంది ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుందో ఇంకా తెలియలేదు. కానీ కచ్చితంగా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక నాలుగో స్థానంలో వార్ 2 నిలిచింది. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతు్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా చేస్తుండగా.. టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఇందులో భాగం కాబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఇక చివరి స్థానంలో అంటే టాప్ 5లో సింగం అగైన్ నిలిచింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ , కరీనా కపూర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు. మరి ఈ క్రేజీ మూవీనీ ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











