పుష్ప 2 కు పవన్ కల్యాణ్ ఎఫెక్ట్.. అల్లు అర్జున్ మూవీ రిలీజ్ వాయిదా.. పవర్‌స్టార్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌‌తో!

తెలుగు సినీ, రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుడు, మేనమామ పవన్ కళ్యాణ్‌కు కానీ ఆయన మద్ధతు పలికిన కూటమికి కానీ బన్నీ జై కొట్టలేదు. పవన్ - చంద్రబాబులకు బద్ధ శత్రువు వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిల తరపున ప్రచారం చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా నంద్యాలలో భార్యతో సహా ల్యాండైన అల్లు అర్జున్.. శిల్పా రవిని గెలిపించాలని కోరారు. తీరా ఎన్నికల్లో బన్నీ సపోర్ట్ చేసిన వ్యక్తి ఓటమి పాలయ్యారు.

పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు అరవింద్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. మెగా ఫ్యామిలీలోని చిన్నా, పెద్ద బెజవాడలో ఒక రోజు ముందే ల్యాండ్ అయ్యారు. వారిలోనూ అల్లు ఫ్యామిలీ జాడ లేదు. ఎన్నికల్లో ఘన విజయం, ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సెలబ్రేషన్స్ పార్టీకి అల్లు అర్జున్ కుటుంబానికి ఇన్విటేషన్ వెళ్లలేదని ఫిలింనగర్ టాక్.

icon star allu arjun rashmika mandanna starrer pushpa 2 may be postponed to december

అన్నింటికి మించి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ .. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను అన్‌ఫాలో కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బన్నీతో ఇకపై తాము ఎలా ఉండబోతున్నామో సాయితేజ్ ద్వారా మెగా ఫ్యామిలీ హెచ్చరికలు పంపిందా.. లేక జరుగుతున్న పరిణామాలతో విసుగుపుట్టి మెగా మేనల్లుడే తనకు తాను ఈ నిర్ణయం తీసుకున్నాడా అన్నది తెలియరాలేదు. ఒకప్పుడు అల్లు అర్జున్‌ని మెగా ఫ్యామిలీ నుంచి వేరుగా చూడొద్దని వేదిక ద్వారా అభిమానులకు పిలుపునిచ్చిన సాయితేజే ఇలా చేశారంటే మెగా కుటుంబాన్ని అల్లు అర్జున్ ఎంతగా కెలికేశాడోనంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ఈ పరిణామాలు అల్లు అర్జున్ అప్‌కమింగ్ మూవీ పుష్ప-2పై ప్రభావం చూపుతాయేమోనని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ అన్న ఒక్క మాటతో ఆయన నటించిన ఓ సినిమాపై కసి తీర్చుకున్నారు మెగా, పవన్ అభిమానులు. నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ పబ్లిసిటీ చేయడంతో సదరు సినిమా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటి పరస్థితులు అంతకంటే దారుణంగా ఉండటం, పైగా పవన్ విక్టరీ సక్సెస్ కొట్టడంతో ఫ్యాన్స్ కూడా మాంచి ఊపులో ఉన్నారు.

icon star allu arjun rashmika mandanna starrer pushpa 2 may be postponed to december

ఇలాంటి పరిస్థితుల్లో పుష్ప-2ను రిలీజ్ చేస్తే ఇబ్బందుల్లో పడతామంటూ మేకర్స్ భావిస్తున్నారని ఫిలింనగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజవుతున్న పుష్ప-2పై భారీ అంచనాలున్నాయి. పైగా పార్ట్ -1 దేశాన్ని ఊపేయడంతో .. సీక్వెల్ ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి రూ.1000 కోట్ల కలెక్షన్స్ అవలీలగా కొట్టేస్తామని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతున్న వేళ.. అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీ వివాదం వారి ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో మెగా , పవన్ ఫ్యాన్స్ ఆధిపత్యం ఉంది. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కూడా వారికి జత కలవడంతో అత్యంత బలంగా ఉన్నారు. పైగా సినీ పరిశ్రమను , తమ అభిమాన హీరోలను తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ దారుణంగా అవమానించారని ఫ్యాన్స్ కసితో రగిలిపోతున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడి తరపున అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లినప్పుడే మిగిలిన హీరోల అభిమానులు కూడా ఊగిపోయారు.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్న విపత్కర పరిస్ధితుల్లో పుష్ప-2ని దించితే అసలుకే మోసం వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2ని ఆగస్టు 15ని కాకుండా .. డిసెంబర్‌లో రిలీజ్ చేస్తే బెటరని అనుకుంటున్నారట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X