సుకుమార్ సతీమణి కోసం అల్లు అర్జున్.. మారుతీ నగర్‌కి రానున్న ఐకాన్‌స్టార్
రెగ్యులర్ హీరోలకి తోడు కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్, రైటర్స్, సింగర్స్ కూడా అప్పుడప్పుడు హీరో అవతారం ఎత్తుతుంటారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో చూసినా ఇలాంటి వారు కనిపిస్తారు. వీరిలో కొందరు హీరోగా సక్సెస్ అయి అలాగే కంటిన్యూ అయితే, కొందరు మాత్రం తాము కూడా హీరో అనిపించుకున్నాం చాలు అని అక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టేస్తుంటారు. ఇంకొందరైతే రెండు పడవల మీదా కాలు అన్న చందంగా కెరీర్ కొనసాగిస్తుంటారు.
ఇదిలాఉండగా.. తెలుగు సినిమా చరిత్రలో విలనిజానికి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు దివంగత రావు గోపాలరావు. నటనే కాదు, డైలాగ్ డిక్షన్‌లోనూ ఆయన ట్రెండ్ సెట్ చేశారు. రావు గోపాలరావు చెప్పిన డైలాగులను క్యాసెట్ల రూపంలో అమ్మారంటే ఆయన ముద్ర ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా రావు గోపాలరావు తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.

రావు గోపాలరావు తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రావు రమేశ్ కూడా తండ్రి బాటలోనే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన వెర్సటైల్ యాక్టింగ్‌తో సాదాసీదా సీన్లను సైతం అద్భుతంగా నిలబెట్టగలరన్న పేరు తెచ్చుకున్నారు. ఇన్ని రోజులు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరించిన రావు రమేశ్ .. హీరోగా మారారు. మారుతి నగర్ సుబ్రమణ్యం పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో హ్యాపీ వెడ్డింగ్ ఫేమ్ లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. ఆగస్ట్ 23న మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రామానికి ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

సుకుమార్‌తో అల్లు అర్జున్ బాండింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్య, ఆర్య-2లతో బన్నీని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసి స్టైలీష్ స్టార్‌గా మార్చారు సుక్కూ. ఆ తర్వాత పుష్పతో అర్జున్‌ని ఏకంగా ఐకాన్‌స్టార్‌గా మార్చారు. తాను సుకుమార్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని బన్నీ.. తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్ పట్ల అంతే విధేయత చూపిస్తారు ఈ క్రియేటివ్ జీనియస్. ఆయనతో ఉన్న స్నేహం కారణంగా , స్వయంగా సుకుమార్ భార్య భాగస్వామిగా ఉన్న మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక, పుష్ప-2 వాయిదా పడ్డాక అల్లు అర్జున్ పాల్గొంటోన్న ఈవెంట్ కావడంతో ఆయన ఏం మాట్లాడతారోనని టాలీవుడ్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











