'ఇదే మా కధ' సినిమా చూడండి.. ఐదు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు గెలవండి.. ఎలా అంటే?
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత విడుదలైన చిన్న సినిమాలను జనాదరణ లభిస్తుండడంతో మరిన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అలా చాలా సినిమాలు విడుదలయ్యాయి కూడా. అలా విడుదలైన సినిమానే ఇదే మా కథ. ఆ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా యూనిట్ ఒక ఆసక్తికర ప్రాతం చేసింది.. ఆ వివరాల్లోకి వెళితే

మిశ్రమ స్పందన
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'ఇదే మా కథ. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. శ్రీకాంత్ - భూమిక - సుమంత్ అశ్విన్ - తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ సినిమాపై ఆసక్తి పెంచగా సినిమా కూడా ఆసక్తికరంగా సాగింది.

అదే ఈ సినిమా కధ
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇదే మా కథ' సినిమా గురు పవన్ దర్శకత్వంలో రూపొందింది. మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మహేష్ గొల్లా ఈ సినిమాని నిర్మించారు. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ రోడ్ జర్నీ చేస్తూ ఎక్కడ కలుసుకున్నారు? ఆ జర్నీ అంతా ఏమైంది? వారి వారి గోల్స్ రీచ్ అయ్యారా లేదా? అనేదే ఈ సినిమా కథ.

ఆసక్తికరంగా ఆ 20 నిముషాలు
నిజానికి తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ వచ్చాయి. అలాంటిది ప్రధాన పాత్రలలో పేరున్న నటీనటులను తీసుకోవడమే కాక సినిమాలో 20 నిమిషాలు మంచు మీద రైడ్, అలాగే వారి మధ్య రేస్ ఆసక్తికరంగా ఉంటుంది. సుమంత్ అశ్విన్ - తాన్యా హోప్ మధ్య లవ్ ట్రాక్ తో పాటుగా యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా బాగా టచ్ చేశారు.

ఎలా పాల్గొనాలంటే
తాజాగా ఈ సినిమా మేకర్స్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అదేంటంటే ఈ ఇదే మా కథ సినిమా చూసిన వారు ఐదు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు గెలిచేలా ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. అయిదు ఆ ఐదు బైకులు గెలవాలి అంటే ఈ సినిమా చూసి ఆ సినిమా టికెట్స్ ఫోటో తీసి #IdheMaaKatha హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా ట్యాగ్ చేసిన వారిలో ఐదుగురికి ఎన్ ఫీల్డ్ బైకులు ఇతర బహుమతులు అందిస్తామని సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
Recommended Video

మీరూ ట్రై చేయండి
సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. పృథ్వీరాజ్, సప్తగిరి, సమీర్, సత్యం రాజేష్, శ్రీజిత ఘోష్, తివిక్రమ్ సాయి, ఆటో రామ్ ప్రసాద్ తదితరులు కూడా ఈ సినిమాలో నటించారు. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సినిమా చూసి కాంటెస్ట్ లో పాల్గొంటే ఆ లక్కీ విన్నర్ మీరే కావచ్చు.


Click it and Unblock the Notifications











