Year Ender 2023: యువత మెచ్చిన టాప్ 5 మలయాళ హీరోయిన్లు వీళ్లే.. మొదటి స్థానంలో మంజు వారియర్!
ప్రతీ ఏడాది ఎంతో మంది హీరోయిన్లు సినీ రంగంలోకి అడుగు పెడుతుంటారు. ముఖ్యంగా చాలా మంది కొత్త కొత్త వాళ్లు వస్తూ... సినీ రంగంలో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతారు. ఒక్క బాషలోనే కాకుండా చాలా భాషల్లో నటిస్తూ అందరికీ ఫేవరెట్ గా నిలిచిపోతుంటారు. ముఖ్యంగా యువత హాట్ ఫేవరెట్లుగా మారుతూ అందరినీ మెస్మరైజ్ చేసే వాళ్లలో మలయాళ హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే మలయాళ హీరోయిన్లలో టాప్ 5లో ఎవరెవరు ఉన్నారు అనే లిస్టును ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసింది. అయితే ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. మంజు వారియర్
1995లో సాక్ష్యం సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిందీ మందు వారియర్. ఆమె అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఎవరూ ఊహించని స్థాయిలో హిట్లు కొట్టింది. 1999లో చివరగా సినిమా చేసిన ఆమె ఆ తర్వాత సినిమాలకు దూరం అయిపోయింది. ఆ తర్వాత 2014లో రీఎంట్రీ ఇచ్చి మరిన్ని హిట్టు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం దేశం మెచ్చిన మలయాళ హీరోయిన్లలో టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది.

2. ఐశ్వర్య లక్ష్మి
32 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ జందుకలుండే నత్తిన ఒరిదవేల్ అనే సినిమాతో 2017లో సినీ రంగంలో అడుగు పెట్టింది. ఇక అప్పటి నుంచి సంవత్సరానికి నాలుగైదు చిత్రాలు చేస్తూ దూసుకళ్తోంది. 2022లో అయితే మొత్తం 8 చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇలా వరుస చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దుమ్మలేపుతున్న ఈమె టాప్ 2 హీరోయిన్ గా నిలిచింది.

3. శోభన
ప్రస్తుతం 53 ఏళ్ల వయసు కల్గిన శోభన నాగార్జున మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. విక్రమ్ అనే సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఆమె అనేక చిత్రాల్లో కనిపించింది. ఎవరూ ఊహించని స్థాయిలో హిట్లు కొడుతూ.. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. 1997లో సినిమా చేసిన ఆమె, 2006లో గేమ్ సినిమా చేసింది. ఇక ఆ తర్వాత అంటే 2021లో మరో సినిమాలో కనిపించి మెప్పించింది. కుర్రకారు హాట్ ఫేవరెట్ గా మారిన ఈమె టాప్ 3 స్థానంలో నిలిచింది.
4. కల్యాణి ప్రియదర్శన్
30 ఏళ్ల వయసు కల్గిన కల్యాణీ ప్రియదర్శన్ 2017లో వచ్చిన హలో సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత తమిళ్ తో పాటు మలయాళ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. 2022లో బ్రో డాడీ అనే సినిమాలో చేసిన ఈమె 2023లో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ యువత మెచ్చిన మలయాళ హీరోయిన్లలో టాప్ 4 హీరోయిన్ గా నిలిచింది.

5. అను సితార
28 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ 2013లో పొటాస్ బాంబా అనే సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆతర్వాత నుంచి వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకెళ్తోంది. తన అందం, అభినయంతో యువత మెచ్చిన హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ తో పాటు మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం దేశం మెచ్చిన టాప్ 5 మలయాళ హీరోయిన్లలో అను సితార స్థానం దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











