For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టీఎన్ఆర్ కుటుంబానికి అండగా ఐడ్రీమ్.. ఆ బాధ్యత మాదే అంటూ ప్రకటన!

  |

  యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన జర్నలిస్ట్ టీఎన్ఆర్ కరోనాతో సోమవారం(మే 10) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్ కాచిగూడ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. టీఎన్ఆర్ మరణం తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఇక ఆయన కుటుంబానికి సైతం పలువురు ఆర్ధికంగా సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  ఎక్కడి నుంచో వచ్చి

  ఎక్కడి నుంచో వచ్చి

  మంచిర్యాల జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన టీఎన్ఆర్ 90లలో హైదరాబాద్ వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కెరీర్ ఆరంభంలో నటుడు,రచయిత ఎల్బీ శ్రీరామ్ వద్ద సహ రచయితగా పనిచేసిన ఆయన ఆ తర్వాత కొన్నేళ్లు పలు టీవీ ఛానెళ్లలో వివిధ హోదాల్లో పని చేశారు. ఈటీవీలో ఫేమస్ అయిన నేరాలు ఘోరాలు కార్యక్రమానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు.

  ఆ కోరిక తీరకుండానే

  ఆ కోరిక తీరకుండానే

  ఐడ్రీమ్ సంస్థలో యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా ఫేమస్ అయిన ఆయన ఇప్పుడిప్పుడే నటుడిగా కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. ఇటీవల హిట్ అయిన సినిమా జాతిరత్నాలు సహా దాదాపు 20 సినిమాల్లో టీఎన్ఆర్ నటించారు. దర్శకత్వం చేయాలన్న కోరికతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు.

  అండగా ఐడ్రీమ్

  అండగా ఐడ్రీమ్

  తాజాగా ఆయన కుటుంబాన్ని ఐడ్రీమ్ సంస్థల ఎండీ వాసుదేవరెడ్డి కలిశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ''అంత్యక్రియల రోజు కలిసిన తర్వాత ఈ ఉదయం మళ్ళీ టిఎన్ఆర్ కుటుంబాన్ని కలిశాను, నేను మాట ఇచ్చినట్టుగానే ఆ కుటుంబానికి 10 లక్షలు అందచేశాను, పిల్లల చదువు మొత్తం నేను చూసుకుంటాను'' అని ఆయన పేర్కొన్నారు.

  వాళ్ళ కోసం డాక్టర్

  వాళ్ళ కోసం డాక్టర్

  ఇక టీఎన్ఆర్ పిల్లలు సహా ఆయన కుటుంబ సభ్యులు కొద్దిమంది ఈ సమయంలో కరోనా బారిన పడ్డారన్న ఆయన అయితే లక్షణాలు లేవని, వారు కోలుకుంటున్నారని పేర్కోన్నారు. పిల్లలతో నిరంతరం టచ్ లో ఉంటూ కరోనా పరిస్థితిని ఎదుర్కోవడానికి నేను అపోలో ఆసుపత్రి నుండి ఒక పీడియాట్రీషియన్ ను కుటుంబానికి అటాచ్ చేశాను అని ఆయన పేర్కొన్నారు.

  Recommended Video

  Popular Telugu YouTube Host #TNR Lost Life | Filmibeat Telugu
  అండగా స్నేహితులు

  అండగా స్నేహితులు

  ఇక టిఎన్ఆర్ కుటుంబం కోసం వసూలు చేస్తున్న నిధుల గురించి కొంత స్పష్టత ఇవ్వాలనుకుంటున్నానన్న ఆయన ఆ మేరకు వివరణ ఇచ్చారు. టీఎన్ఆర్ ఆకస్మిక మరణంతో ఆయన గురించి వ్యక్తిగతంగా, ఆయన ఆర్థిక స్థితిగతులు తెలిసిన టిఎన్ఆర్ స్నేహితులు టీఎన్ఆర్ కుటుంబానికి అండగా నిలవడానికి ముందుకు వచ్చారని అన్నారు.

  పోయిన మనిషిని ఎలాగూ తీసుకు రాలేము కాబట్టి ఆయన కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నారని అన్నారు. టిఎన్ఆర్ కేవలం ఐడ్రీమ్ ఉద్యోగి మాత్రమే కాదు. ఆయన నా వ్యక్తిగత స్నేహితుడు. ఆయన కుటుంబానికి అండగా ఉండడం నా బాధ్యత అని ఆయన అన్నారు. ఆయన శారీరకంగా మన మధ్య లేనప్పటికీ, ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉంటాయని అన్నారు.

  English summary
  This Monday, the Telugu film industry mourned the sudden demise of Tummala Narasimha Rao aka TNR due to Covid-19. Celebrities like Nani, Vijay Deverakonda, Anil Ravipudi, Sundeep Kishan and Eesha Rebba paid tributes to anchor and actor TNR and offered condolences to his family. Today I Dream MD Vasudevareddy met his family and handed over financial help promisied by him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X