‘అలా చేస్తానంటే 100 ఎకరాలు అమ్మేస్తా!' అనిల్ రావిపూడిపై శివాజీ పందెం

టాలీవుడ్‌లో ప్రస్తుతం "హిట్ మిషన్" అంటే ముందుగా గుర్తొచ్చే పేరు దర్శకుడు అనిల్ రావిపూడి. వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అనిల్, ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు. 2025 సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలతో వరుసగా రెండు భారీ బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు. ఈ రెండు సినిమాలూ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో... వరుసగా రెండు సంక్రాంతులకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన అరుదైన దర్శకుడిగా అనిల్ రావిపూడి రికార్డు సృష్టించారు.

ఇలాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌పై తాజాగా హీరో శివాజీ చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శివాజీ నటించిన 'సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ..'నాకు హీరో అవ్వాలనే ఆలోచన అస్సలు లేదు. కెమెరా వెనుక ఉండి కథను నడిపించడంలోనే నాకు నిజమైన తృప్తి. నా సినిమాల్లో హీరోలే నాకు డెమీగాడ్స్. వాళ్లను స్క్రీన్‌పై సూపర్‌స్టార్లలా ఎలివేట్ చేయడమే నాకు ఇష్టం' అంటూ తన దర్శక దృక్పథాన్ని వివరించారు.

If Anil Ravipudi Says Yes I ll Sell Ali s 100 Acres Shivaji s Funny Comment Goes Viral

అదే ఈవెంట్‌లో ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రేక్షకులను నవ్వించింది. గతంలో 'దండోరా' ఈవెంట్ సందర్భంగా తాను వివాదాల్లో ఇరుక్కున్న విషయాన్ని గుర్తు చేస్తూ, 'ఇప్పుడు మళ్లీ పిలిచారంటే భయమేసింది' అని శివాజీ అన్నట్లు అనిల్ వెల్లడించారు. దీనికి అనిల్ నవ్వుతూ ఈ సినిమాకైనా తప్పకుండా వస్తానని భరోసా ఇచ్చారట. పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ఇద్దరూ ఒకరినొకరు ఆటపట్టించుకోవడం ఈవెంట్‌కు అదనపు హైలైట్‌గా నిలిచింది.

తర్వాత స్టేజ్‌పై మాట్లాడిన శివాజీ.. 'అనిల్ ఫోటోలు చూస్తుంటే ఈ అబ్బాయి ఎప్పుడో హీరో అవుతాడేమో అనిపించింది. ఎవరు ఏం కావాలన్నది కళామతల్లి నిర్ణయం. తమిళ్‌లో చాలామంది డైరెక్టర్లు హీరోలుగా నటించారు కదా... తెలుగులో ఎందుకు ప్రయత్నించకూడదు?' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ ఉదాహరణ ఇస్తూ.. ఎన్టీఆర్ గారు హీరోగా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, చివరికి మేకప్ మ్యాన్ గా కూడా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారని గుర్తుచేశారు.

అసలు వైరల్ మోమెంట్ అయితే ప్రెస్‌మీట్‌లో వచ్చింది. ఓ జర్నలిస్ట్ శివాజీని ప్రశ్నిస్తూ 'డైరెక్టర్ అనిల్ రావిపూడిని హీరోగా పెట్టి సినిమా తీయాలనే ఆలోచన ఉందా?' అని అడగగా... శివాజీ వెంటనే నవ్వుతూ' అనిల్ ఓకే అంటే.. 100 ఎకరాలు అయినా అమ్మేస్తాను!'అని సంచలన డైలాగ్ వేశారు. పక్కనే ఉన్న అలీ నవ్వడంతో వెంటనే మాట మార్చిన శివాజీ..'అనిల్ గారు హీరోగా చేస్తానంటే... అలీ గారిది వంద ఎకరాలు అమ్మేస్తా!' అంటూ ఫన్నీ ట్విస్ట్ ఇచ్చారు.

అంతేకాదు, 'ప్రొడ్యూసర్ అలీ డాలర్ అడ్వాన్స్ ఇచ్చారు కదా... ఆ మాత్రం హైట్ లేకపోతే ఎలా?' అంటూ మరింత సరదాగా మాట్లాడారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి సక్సెస్ స్ట్రీక్, శివాజీ ఫన్నీ కామెంట్స్ కలిసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి.

More from Filmibeat

Read more about: anil ravipudi sivaji ali
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X