For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగార్జున ‘ఘోస్ట్’ నుంచి కాజల్ ఔట్: ఆమె స్థానంలో టాప్ హీరోయిన్ టాలీవుడ్‌ రీఎంట్రీ

  |

  చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఆ మధ్య వరుస విజయాలను అందుకొన్న ఆయన 'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత మాత్రం ఒక్కటంటే ఒక్క సక్సెస్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయారు. అయినప్పటికీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, విజయం మాత్రం ఆయనకు అందనంత దూరంలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో 'వైల్డ్ డాగ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా... ప్రతికూల పరిస్థితుల కారణంగా కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. దీంతో ఇదీ నిరాశనే మిగిల్చింది.

  పబ్లిక్ ప్లేస్‌లో భర్తతో శ్రీయ సరసాలు: ఏకంగా పైకి లేపేసి మరీ.. దారుణమైన ఫోజుతో అందాల విందు

  ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం వేచి చూస్తోన్న అక్కినేని నాగార్జున.. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారుతో ఆయన 'ఘోస్ట్' అనే సినిమాను చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ, కొద్ది రోజుల తర్వాత ఇది పున: ప్రారంభం అయింది. దీంతో ఆ అనుమానాలకు పుల్‌స్టాప్ పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

  Ileana DCruz Replace Kajal Aggarwal for Akkineni Nagarjuna Ghost

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఘోస్ట్' మూవీలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. దీని వెనుక పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక, ఈ మూవీలో ఆమె స్థానాన్ని గోవా బ్యూటీ ఇలియానా భర్తీ చేయబోతుందని కూడా ఓ న్యూ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ సుందరాంగి.. నాగార్జున ఘోస్ట్ మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ జోరుగానే వినిపిస్తోంది.

  Bigg Boss: షోలో మరో దారుణ సంఘటన.. ప్రియాంకతో అతడు అసభ్య ప్రవర్తన.. టీషర్ట్ లోపల చేయి పెట్టి!

  ఇదిలా ఉండగా.. కాజల్ అగర్వాల్ గర్భవతి అయిందని ఈ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆమె అక్కినేని నాగార్జున నటిస్తోన్న 'ఘోస్ట్' మూవీ నుంచి తప్పుకుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించగా.. కొత్త కాంబినేషన్ కోసం ఇలియానాతో సంప్రదింపులు జరిపారని తెలిసింది. సరైన అవకాశం కోసం వేచి చూస్తోన్న ఆమె.. నాగార్జున సరసన నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఇండస్ట్రీలో వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  Ileana DCruz Replace Kajal Aggarwal for Akkineni Nagarjuna Ghost

  క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో అక్కినేని నాగార్జున ఊహించని పాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

  English summary
  Akkineni Nagarjuna Now Doing An Action Film Under Praveen Sattaru Direction. Ileana D'Cruz Replace Kajal Aggarwal for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X