గోవాలో నా కోరిక తీర్చుకుంటా.. అందుకే ఈ ప్రయత్నాలు.. సీక్రెట్ రివీల్ చేసిన ఇలియానా
టాలీవుడ్, బాలీవుడ్ తెరలకు సుపరిచితం గోవా బ్యూటీ ఇలియానా. అందాలు ఆరబోయడంలో కొత్త టేస్ట్ చూపించిన ఈ బ్యూటీ.. దక్షిణాది, ఉత్తరాది సినీ ఇండస్ట్రీలో ఊపు తెప్పించింది. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడటం అమ్మడి స్టైల్. అదే బాటలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో తన మనసులోని మాట బయటపెట్టేసింది ఇలియానా. వివరాల్లోకి పోతే..

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో
దేవదాస్ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన ఇలియానా దక్షిణాదిలో టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సౌత్‌లో కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్‌పై దృష్టి సారించి ముంబై వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ కూడా పలు సినిమాల్లో నటించి బీ టౌన్ ప్రేక్షకులకు తన అందాల రుచి చూపించింది.

కోరిక తీర్చుకోవడానికి చాలా అవసరం
ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ అన్నట్లుగా సాగిపోతున్న ఇలియానాకు ఇంకా చాలా డబ్బులు కావాలట. అది కూడా తన కోరిక తీర్చుకోవడానికి అంటోంది ఇలియానా. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన కొన్ని విషయాలు యువతలో ఆసక్తి రేకెత్తించాయి.

దాని కోసమే ఇల్లీ బేబీ తపన
గోవాలో సముద్రానికి ఎదురుగా ఓ ఇల్లు కట్టుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటోందట ఇలియానా. పైగా అదే తన చిరకాల కోరిక అని కూడా చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. సకల సౌకర్యాలతో అబ్బురపరిచే విధంగా ఈ ఇల్లు నిర్మాణం చేపట్టాలని ఆమె భావిస్తోందట. దాని కోసమే తనకు చాలా డబ్బులు కావాలని పేర్కొంటోంది ఇల్లీ బేబీ.

చిరకాల కోరిక.. ఆ డబ్బు సంపాదించి..
గోవాలో ప్రస్తుతం తాము ఉంటున్న ఇల్లు సముద్రానికి దగ్గర్లోనే ఉంటుంది.. కానీ, సముద్రానికి అభిముఖంగా ఇల్లు కట్టుకోవాలనేది తన చిరకాల కోరిక అంటోంది ఇలియానా. త్వరగా ఆ డబ్బు సమకూర్చుకొని వచ్చే ఏడాదైనా ఆ కల నెరవేర్చుకోవాలని భావిస్తున్నా అంటోంది ఈ బ్యూటీ. ఏదో ఒక రోజు కచ్చితంగా తన కల నెరవేరుతుందని బల్లగుద్ది మరీ చెబుతోంది ఇలియానా.

బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్.. ఆ తర్వాత
ఇక ఇంతకాలం తన బాయ్ ఫ్రెండ్, విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసిన ఇలియానా ఆ తర్వాత బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తిరిగి కెరీర్‌పై దృష్టి సారించిన ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఇటీవలే రవితేజతో..
ఇటీవలే రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించింది ఇలియానా. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో అమ్మడికి సరైన టాలీవుడ్‌లో రీ ఎంట్రీ దొరకలేదు.
Recommended Video

చిరంజీవితో ఇలియానా రొమాన్స్
ఒకప్పుడు ఎలాగైతే నడుము అందాలతో మాయ చేసిందో ఇప్పుడు కూడా అదే ఫార్ములా అప్లై చేయాలని ఇలియానా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాలో ఇలియానానే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











