నయనతార బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులో ‘అంజలి విక్రమాదిత్య’
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించి బ్లాక్ బస్టర్ తమిళ చిత్రం 'ఇమైక్క నొడిగల్' చిత్రాన్ని తెలుగులో 'అంజలి విక్రమాదిత్య' పేరుతో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ రైట్స్ సిహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్ సొంతం చేసుకున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్ అజయ్ గణన్‌ముత్తు దర్శకత్వం వహించారు. తెలుగు వెర్షన్ విశ్వశాంతి క్రియేషన్స్ బేనర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

ఈ మూవీలో నయనతార, అధర్వ, రాశి ఖన్నా ముఖ్యమైన పాత్రలు పోషించగా... బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ రోల్ చేశారు. ఈ చిత్రంలో నయనతార అంజలి అనే సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించింది. అంజలి భర్త పాత్రలో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ చేశారు. తమిళంలో ఈ మూవీని సిజె జయకుమార్ కేమియో ఫిల్మ్స్ బేనర్లో నిర్మించారు. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చగా, ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు.
నటీనటులు: నయనతార, అధర్వ, రాశి ఖన్నా, అనురాగ్ కశ్యప్, రమేష్ తిలక్, దేవన్ తదితరులు..
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్ అజయ్ గణన్‌ముత్తు
నిర్మాతలు: సిహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్
బేనర్: విశ్వశాంతి క్రియేషన్స్
సంగీతం: హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ: ఆర్‌డి రాజశేఖర్
ఎడిటర్: భువన్ శ్రీనివాసన్


Click it and Unblock the Notifications











