Shobitha vs Samantha: ఆ విషయంలో శోభిత తర్వాతే సమంత.. ఇది ఘోర అవమానమే..

ఇటీవల టాలీవుడ్ లో అత్యధికంగా వినిపిస్తున్న పేరు శోబితా ధూళిపాళ్ల. ఈ అమ్మడు అక్కినేని వారసుడు నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి విషయాలతో నిత్యం వార్తల్తో నిలిచింది. డిసెంబర్ 4 న చైతూను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంటి కోడలుగా మారింది. దీంతో ఎనలేని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇంతలాంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను కూడా బీట్ చేసి.. ముందు వరుసలో నిలిచింది శోభిత దూళిపాళ్ల. ఇంతకీ ఏ విషయంలో సమంత వెనక్కి నెట్టి శోభిత ముందు నిలిచిందంటే?

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ అమ్మడు 'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. అనంతరం వరుస సక్సెస్ లు అందుకుంటూ అగ్ర హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలోనే అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి, పెళ్లి చేసుకోంది.కానీ వీరి వివాహా బంధం మూడ్నాల ముచ్చటగా మారిపోయింది. ఆ తర్వాత మయోస్సైటిస్ అనే వ్యాధితో బాధపడడం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండటం. దాదాపు ఏడాది తరువాత బాలీవుడ్ లో వరుస విజయాలనుకుంటూ తిరిగి దూసుకెళ్తుంది సమంత.

IMBD 2024 top 10 most popular Indian actors Triptii Dimri top Sobhita Dhulipala Samantha

ఇక శోభిత ధూళిపాల.. ఈ అమ్మడు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గత ఆరు నెలలుగా ఈ అమ్మడు పేరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ట్రెండింగ్ మారింది. వాస్తవానికి ఈ హీరోయిన్ తెలుగింటి అమ్మాయి. కానీ, బాలీవుడ్ పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో టాలీవుడ్ మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం ఫోకస్ పెట్టింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు అంటూ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేశారు మూవీ లవర్స్.

ఇదిలాఉంటే.. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఐఎండిబి (IMDB)టాప్ 10 ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ లిస్టు (Most Popular Indian Stars Of 2024) ను విడుదల చేసింది. 2024లో ఇండియాలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ జాబితాలో షారుక్ ఖాన్, రన్ బీర్ కపూర్, దీపికా పదుకొనే, వంటి అగ్రతారాలను సైతం వెనక్కి నెట్టి హీరోయిన్ త్రిప్తి డిమ్రీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ ఏడాది ఈ అమ్మడు నటించిన బుల్ బూలయ్య 3, యానిమల్, లైలా మజ్ను వంటి సినిమాలు హిట్ టాక్ అందుకోవడంతో.. మంచి పాపులర్టీని సొంతం చేసుకుంది. దీంతో ఈ లిస్టులో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది.

IMBD 2024 top 10 most popular Indian actors Triptii Dimri top Sobhita Dhulipala Samantha

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్ సబ్స్క్రైబర్ల స్క్రీనింగ్ ఆధారంగా ఈ ర్యాంకును వెల్లడించినట్లు IMDB పేర్కొంది. IMDB జాబితా ప్రకారం.. రెండో స్థానంలో దీపికా పదుకొనే, మూడవ స్థానంలో ఈశాన్ కత్తర్, నాలుగో స్థానంలో షారుక్ ఖాన్, ఐదో స్థానంలో శోభిత దూళిపాళ్ల ఉన్నారు. ఈ ఏడాది శోభితా ధూళిపాల టాలీవుడ్ లో నే కాకుండా బాలీవుడ్ లో కూడా మోస్ట్ పాపులర్ హీరోయిన్గా నిలిచింది. నాగచైతన్యతో ఈ అమ్మడి వివాహం జరగడం అలాగే మంకీ మ్యాన్ విడుదల సందర్భంగా నెటిజెన్లు ఈమె కోసం తెగ సెర్చ్ చేశారని, అంతేకాకుండా ఈ అమ్మడు గ్లామర్ షో మామూలుగా ఉండదు. తన బోల్డ్ ఫోటోలతో నెడిజెన్స్ కు చెమటలు కారేలా చేస్తుంది.

ఇక ఆ తర్వాత స్థానంలో షేర్వానీ. ఐశ్వర్యరాయ్ నిలిచారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది ఆమె నటించిన హనీ బన్నీ సిరీస్ విడుదల కావడం, మయోసైటిస్ వ్యాధి బారిన సమంతా పడడం, విడాకులు అనంతరం నాగచైతన్య శోభితాను పెళ్లి చేసుకోవడం, తదితర కారణాలచే నెటిజన్లు ఆమె కోసం వెతకారని IMDB వెల్లడించింది.

More from Filmibeat

Read more about: samantha shobhita triptii dimri
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X