Year End 2023: 2023 మోస్ట్ పాపులర్ స్టార్స్ వీళ్లే..హీరోలకంటే హీరోయిన్ల హవానే ఎక్కువ ఉందిగా..ఎవరెవరున్నారంటే?

మరో 20 రోజుల్లో ఈ ఏడాది పూర్తి అయిపోతుంది. 2023కు గుడ్ బై చెప్పేసి 2024కు వెల్ కమ్ చెప్పబోతున్నాం. అయితే ఈ ఏడాది చాలా మంది స్టార్ హీరోహీరోయిన్లు అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కేవలం తమ భాషలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు.

ఈక్రమంలోనే అద్భుతమైన రెప్సాన్స్ అందుకొని మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టులో చేరిపోయారు. అయితే ఐఎండీబీ తాజాగా ఓ లిస్టును విడుదల చేసింది. టాప్ 10 మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టును వెల్లడించింది. అందులో ముగ్గురు మాత్రమే హీరోలు ఉండగా.. మిగిలిన ఏడు స్థానాల్లో హీరోయిన్లే ఉన్నారు. అయితే ఏయే స్థానంలో ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

IMBD Top 10 Most Popular Stars of 2023 Shah Rukh Khan Alia Bhatt Tamannah Nayanthara Check Full Details

1. షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాధ్ షా 2023ను పఠాన్ సినిమాతో ప్రారంభించారు. అలాగే డంకీతో ముగించాలని చూస్తున్నారు. అయితే ఈ మధ్యలో చేసిన జవాన్ సినిమా తోబాక్సాఫీసును షేక్ చేశాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వచ్చి అత్యధిక వసూళ్లు సాధించిన ఈ ఏడాది తొలి చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఇప్పటికి ఏడు సార్లు మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టులో నెంబర్ వన్ స్థానాన్ని సంపాధించుకున్నాడు.

2. ఆలియా భట్
2023లో విడుదలైన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మరియు హార్ట్ ఆఫ్ స్టోన్ అనే రెండు పెద్ద చిత్రాలలో నటించింది. అలా వరుసగా రెండో సంవత్సరం జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. అలాగే ఈ ఏడాది ఈమె హాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది.

IMBD Top 10 Most Popular Stars of 2023 Shah Rukh Khan Alia Bhatt Tamannah Nayanthara Check Full Details

3. దీపికా పదుకొణె

దీపికా పదుకొణె పఠాన్‌లోని "బేషరమ్ రంగ్" పాటలో అద్భుతమైన స్టెప్పులు వేసి అందరినీ అలరించింది. అలాగే పఠాన్‌ సినిమాలో షారుఖ్ ఖాన్‌కి వ్యతిరేకంగా నటించి.. అతని రేంజ్ కి సరిపోయే యాక్షన్ సన్నివేషాలు కూడా చేసింది. అలాగే జవాన్‌లో షారుఖ్ భార్యగా, తల్లిగా కూడా అదరగొట్టింది.

4. వామికా గబ్బి
వామికా గబ్బి.. "జూబ్లీ", "మోడరన్ లవ్ చెన్నై" మరియు "చార్లీ చోప్రా & ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీ" అనే మూడు వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. అలాగే కాలీ జోట్టా అనే పంజాబీ చిత్రంలో కూడా నటించింది. ఐఎండీబీ మోస్ట్ పాపులర్ స్టార్స్ లో తొలిసారి ఈమె స్థానం దక్కించుకుంది. అలాగే ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్లో సంవత్సరానికి మూడు సార్లు నంబర్ 1 స్థానంలో నిలిచింది.

5. నయనతార

నయనతార.. జవాన్ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల నుండి షారుఖ్ తో కలిసి రొమాంటిక్ పాటలకు స్టెప్పులు వేయడంలో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. అలాగే నయనతార తమిళ భాషలో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇరైవన్‌లో కూడా నటించి మెప్పించింది. అలాగే ఈమె ఈ ఏడాదే ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టింది. ఒకే ఒక్క రోజులో 1.4 మిలియన్ల ఫాలోవర్స్‌ని సాధించింది. గతంలో కత్రినా కైఫ్ పేరిట ఉన్న ఈ రికార్డును నయనతార బద్దలు కొట్టింది.

IMBD Top 10 Most Popular Stars of 2023 Shah Rukh Khan Alia Bhatt Tamannah Nayanthara Check Full Details

6. తమన్నా భాటియా
తమన్నా భాటియా.. లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ తో పాటు "జీ కర్దా", "ఆఖ్రీ సచ్"లలో నటించింది. బాంద్రా, భోలా శంకర్ వంటి అద్భుతమైన చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. జైలర్‌ సినిమాలో అథిధి పాత్రలో ఆటపాటతో అదరగొట్టింది.

IMBD Top 10 Most Popular Stars of 2023 Shah Rukh Khan Alia Bhatt Tamannah Nayanthara Check Full Details

7. కరీనా కపూర్ ఖాన్
కరీనా కపూర్ ఖాన్ 2023లో జానే జాన్‌తో ఓటీటీ అరంగేట్రం చేసింది. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత థ్రిల్లర్ జానర్‌ లో నటించి మెప్పించింది. బకింగ్‌ హామ్ మర్డర్స్ అనే చిత్రంలో నటించి అందరినీ మెప్పించిందీ ముద్దుగుమ్మ.

8. శోభితా ధూళిపాళ్ల

శోభితా ధూళిపాళ ఈ సంవత్సరం పొన్నియిన్ సెల్వన్: పార్ట్ టూలో తన పాత్రను తిరిగి పోషించింది. అలాగే "ది నైట్ మేనేజర్" రెండు సీజన్లలో కూడా నటించి మెప్పించింది.

IMBD Top 10 Most Popular Stars of 2023 Shah Rukh Khan Alia Bhatt Tamannah Nayanthara Check Full Details

9. అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ OMG సీక్వెల్‌తో తిరిగి వచ్చాడు. పదకొండేళ్ల క్రితం పార్ట్ 1 రాగా.. ఇటీవలే పార్ట్ 2 వచ్చింది. అద్భుతమైన హిట్ టాక్ తో దూసుకెళ్లింది. అలాగే కుమార్ సెల్ఫీ, మిషన్ రాణిగంజ్‌లో కూడా అక్షయ్ కుమార్ నటించి మెప్పించారు.

10. విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి ఈ ఏడాదే జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. అలాగే మొదటి సారి వెబ్ సిరీస్ ఫర్జీలో కూడా నటించారు. మైఖేల్, విడుతలై పార్ట్ 1, యాదుమ్ ఊరే యావరుమ్ కేలిర్, ముంబైకర్‌లో వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా కత్రినా కైఫ్‌తో కలిసి నటించిన అతని రెండో హిందీ చిత్రం మెర్రీ క్రిస్మస్ 2024లో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X