twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    IMDB Best of 2022 టాప్ లేపిన ధనుష్, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, సమంత.. ఎవరెవరికీ ఏ స్థానం అంటే?

    |

    భారతీయ సినిమా పరిశ్రమలో 2022 సంవత్సరం మిక్స్‌డ్ రెస్పాన్స్ కూడగట్టుకొన్నాయి. వివిధ భాషల్లో రిలీజైన సినిమాల్లో దాదాపు 60 శాతానికి పైగా పరాజయం పొందాయి. 30 శాతం యావరేజ్‌గా నిలిస్తే.. మరో 10 శాతం హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకొన్నాయి. అయితే ప్రస్తుత ఏడాదిలో అద్బుతంగా తెరపై రాణించిన హీరో, హీరోయిన్ల జాబితాను ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ పొందుపరిచింది. ఈ జాబితాలో ఎవరెవరికీ చోటు దక్కాయంటే?

    2022 ఐఎండీబీ టాప్ 10 జాబితాలో

    2022 ఐఎండీబీ టాప్ 10 జాబితాలో

    IMDB Best of 2022 జాబితాలో దక్షిణాది సీనీ పరిశ్రమకు సంబంధించిన వారు ఎక్కువ మందే కనిపించారు. టాప్ 1 స్థానంలో హీరో ధనుష్ నిలిస్తే.. రెండో స్థానంలో అలియాభట్ నిలిచింది. ఇక ఆ తర్వాత స్థానాల్లో ఐశ్వర్యరాయ్, రాంచరణ్, సమంత రుత్ ప్రభు, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, ఎన్టీ రామారావు, అల్లు అర్జున్, యష్ ఈ జాబితాలో చోటు సంబంధించారు.

    ధనుష్ టాప్ 1 స్థానంలో

    ధనుష్ టాప్ 1 స్థానంలో


    టాప్ స్థానంలో నిలిచిన ధనుష్ విషయానికి వస్తే.. హిట్టు, ఫ్లాప్ అనే తేడా లేకుండా ఆయన నటించిన చిత్రాలు ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి. మారన్, నానే వరువీన్, తిరుచిత్రాంబళమ్ తమిళంలో రిలీజ్ కాగా, హాలీవుడ్ చిత్రం ది గ్రే మ్యాన్ చిత్రంలో అతిథి పాత్రను పోషించారు. దాంతో టాప్ వన్ స్థానంలో ఐఎండీబీ ధనుష్‌ను పెట్టింది.

     ఆలియాభట్ 2 స్థానంలో

    ఆలియాభట్ 2 స్థానంలో


    బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్లలో ఒకరైన ఆలియాభట్ భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2022లో గుంగుభాయ్ కతియావాడి, RRR, డార్లింగ్స్, బ్రహ్మస్త్ర చిత్రాలతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచింది. దాంతో అలియాభట్ ఐఎండీబీ జాబితాలో రెండోస్థానంలో నిలిచింది.

    ఐశ్వర్యరాయ్, రాంచరణ్‌ పోటాపోటీగా

    ఐశ్వర్యరాయ్, రాంచరణ్‌ పోటాపోటీగా


    ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌కు సంబంధించి పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. పొన్నియన్ సెల్వన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్నది. దాంతో ఆమె మూడోస్థానంలో నిలిచింది. అలాగే రాంచరణ్ RRR మూవీతో దేశవ్యాప్తంగా వసూళ్లను సాధించింది. దాంతో మెగా పవర్ స్టార్‌కు నాలుగో స్థానం దక్కింది.

    సమంత ఐదో స్థానంలో


    అలాగే గతంలో ది ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత రుత్ ప్రభు 2022లో కథువాకుల రెండు కాథల్, అలాగే యశోద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాల్లో అద్బుతమైన టాలెంట్ ప్రదర్శించిన సమంత 5వ స్థానంలో నిలిచింది. విక్రమ్ వేదతో విజయం అందుకొన్న హృతిక్ రోషన్ 6వ స్థానంలో నిలిచాడు.

    రాంచరణ్, ఎన్టీఆర్, యష్‌కు ఎన్నో స్థానం అంటే..

    రాంచరణ్, ఎన్టీఆర్, యష్‌కు ఎన్నో స్థానం అంటే..


    RRR సినిమాతో ఎన్టీఆర్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ భారీ విజయాలు అందుకొన్నారు. అయితే వీరిద్దరికి ఆ రెండు సినిమాలు పాన్ ఇండియాలు కావడం విశేషంగా మారింది. ఇక యష్ విషయానికి వస్తే.. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా గుర్తింపు పొందారు. ఇక కేజీఎఫ్ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోయారు. అయితే ఈ జాబితాలో కియారా అద్వానీకి చోటు దొరకడం ఆశ్చర్యం కలిగించింది.

    English summary
    IMDB declared Indian Top 10 Celebrites. The tweeted that we have arrived at the moment we’ve all been waiting for 🥁 Presenting the IMDb Top 10 Most Popular Indian Stars of the year
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X